తప్పుడు ఆరోపణలతో క్షోభకు గురిచేయొద్దు: కోడెల

By narsimha lodeFirst Published Aug 29, 2019, 11:07 AM IST
Highlights

అసెంబ్లీ ఫర్నీచర్ విషయమై మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు స్పందించారు. తనను మానసికంగా క్షోభ పెట్టకూడదని ఆయన కోరారు. 

అమరావతి: తప్పుడు ఆరోపణలతో  తనను మానిసికంగా క్షోభ పెట్టకూడదని మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కోరారు.

గురువారం నాడు ఆయన తనపై నమోదైన కేసుల విషయమై స్పందించారు.ఈ నెల 23వ తేదీ రాత్రి కోడెల శివప్రసాదరావుకు గుండెపోటుకు గురైన విషయం తెలిసిందే.

అసెంబ్లీ ఫర్నీచర్‌ను దారిని మళ్లించారనే విషయమై ఈ నెల 25వ తేదీన కోడెలతో పాటు ఆయన తనయుడు శివరామ్‌పై కూడ పోలీసులు కేసు  నమోదు చేశారు.ఈ పరిణామాలపై కోడెల శివప్రసాదరావు స్పందించారు.

హైద్రాబాద్ నుండి అసెంబ్లీ ఫర్నీచర్ ను అమరావతికి తరలించే సమయంలో   పాత సామాగ్రిని తన క్యాంపు కార్యాలయానికి తరలించారని కోడెల చెప్పారు. తన పదవీ కాలం పూర్తి కాగానే ఫర్నీచర్ ను తీసుకెళ్లాలని అసెంబ్లీ కార్యదర్శికి లేఖ రాసినట్టుగా ఆయన చెప్పారు.

ఫర్నీచర్‌కు సంబంధించిన  డబ్బులు కూడ చెల్లిస్తానని తాను అసెంబ్లీ కార్యదర్శికి స్పష్టం చేసినట్టుగా ఆయన గుర్తు చేశారు. తన కార్యాలయానికి మూడు రోజుల క్రితం అసెంబ్లీ అధికారులు వచ్చారన్నారు. అసెంబ్లీ ఫర్నీచర్ ఉంటే తీసుకెళ్లాలని తాను కోరినట్టుగా ఆయన  వివరించారు.

ఉద్దేశ్యపూర్వకంగానే తనను ఇబ్బంది పెడుతున్నారనే అభిప్రాయాన్ని కోడెల శివప్రసాదరావు వ్యక్తం చేశారు.తప్పుడు ఆరోపణలతో తనను ఇబ్బందుల పాలు చేయకూడదని ఆయన కోరారు.
 

సంబంధిత వార్తలు

టీడీపీ నేతలకు కేసుల ఉచ్చు: కోడెలతో మొదలు పెట్టి...

సీబీఐ విచారణకు హైకోర్టు ఆర్డర్: అజ్ఞాతంలోకి యరపతినేని

ఫోర్జరీ సంతకాలు.. భూమి విక్రయం: మాజీ మంత్రి సోమిరెడ్డిపై కేసు నమోదు

అజ్ఞాతంలోకి టీడీపీ నేత కూన రవికుమార్: పోలీసుల గాలింపు

కోడెల షోరూంలో తనిఖీలు: అసెంబ్లీ ఫర్నీచర్ రికవరీ

అసెంబ్లీ ఫర్నీచర్ దారి మళ్లింపు: కోడెలపై మరో కేసు

ట్విస్ట్: డీఆర్‌డీఏ వాచ్‌మెన్‌కు 30 ల్యాప్‌టాప్‌‌లు అప్పగింత

శ్వాస తీసుకోవడానికి కోడెల ఇబ్బంది: ప్రభుత్వ ఒత్తిడి వల్లనే...

నిలకడగా కోడెల ఆరోగ్యం... హైదరాబాద్ కి తరలింపు?

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు గుండెపోటు

కోడెల కుటుంబంపై మరో కేసు: 30 ల్యాప్‌టాప్ లు ఎక్కడ?

నా ఆఫీసులో చోరీ వెనుక వైసీపీ.. దుండగుడు ఆ పార్టీ వ్యక్తే: కోడెల

కోడెల ఇంట్లో చోరీ: కంప్యూటర్లను ఎత్తుకెళ్లిన మాజీ ఉద్యోగులు, పలు అనుమానాలు

దొంగతనం చేసి పరువు తీశారు.. కోడెలపై విజయసాయి విమర్శలు

అధికారాన్ని అభివృద్ధికి వాడండి.. బురద జల్లడానికి కాదు: కోడెల

అసెంబ్లీ ఫర్నిచర్ నేనే వాడుకున్నా..డబ్బులు కట్టేస్తా: కోడెల

అసెంబ్లీ ఫర్నిచర్ మాయం: కోడెల మెడకు మరో ఉచ్చు..?

కోడెల ఇంటికి అసెంబ్లీ ఫర్నీచర్ తరలింపుపై విచారణ : చీఫ్ మార్షల్ పై తొలివేటు

click me!