
అమరావతి: ఏపీ రాజధానిపై ప్రజలను గందరగోళానికి గురిచేయడం మంచిది కాదని హితవు పలికారు మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. రాజధానిపై వైసీపీ నేతలతోపాటు ఇతర పార్టీలకు చెందిన నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని దాని వల్ల రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతుందన్నారు.
నాలుగు ప్రాంతాల్లో రాజధానులు ఏర్పాటు చేయాలన్న బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. టీజీ వెంకటేష్ వ్యాఖ్యల పట్ల రైతుల్లో మరింత ఆందోళన మెుదలైందని విమర్శించారు.
మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్, గౌతంరెడ్డిలు రాజధానిపై తలాతోక లేకుండా వ్యాఖ్యానిస్తున్నారని మండిపడ్డారు. రాజధానిపై నెలకొన్న అపోహాలు తొలగించేలా సీఎం జగన్, కేంద్ర ప్రభుత్వం రాజధానిపై స్పష్టత ఇవ్వాలని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు డిమాండ్ చేశారు.
ఇకపోతే రాజధానిపై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై గతంలోనే మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని తరలింపునకు ప్రయత్నిస్తే తాను ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించిన సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి
ఆత్మహత్యలకు సైతం వెనుకాడం :జగన్ సర్కార్ కి అమరావతి రైతుల హెచ్చరిక
అమరావతిపై రచ్చ:నాలుగు రాజధానుల వెనుక జగన్ వ్యూహమిదేనా?......
అమరావతికి చెల్లు చీటీ, జగన్ ఆలోచన ఇదీ: టీజీ వెంకటేష్ సంచలనం
ఏ ఒక్క సామాజికవర్గానిది కాదు: అమరావతిపై బొత్స మరోసారి సంచలనం
రాజధానిపై మరో బాంబు పేల్చిన మంత్రి బొత్స
జగన్ చెప్తేనే లెక్క, రైతులు ఆందోళన పడొద్దు: అమరావతి రైతులతో సుజనాచౌదరి
ఎపి రాజధాని అమరావతికి జగన్ టోకరా: వ్యూహం ఇదీ...
అమరావతి: జగన్ హామీనే బిజెపి కూడా.. ఆలోచనలు ఒక్కటే
అమరావతిపై రెఫరెండం కోరే యోచనలో జగన్.....
రాజధానిపై తలా ఓ మాట మాట్లాడుతున్నారు.. గల్లా జయదేవ్