ఫరూఖ్ చాలా ముదురు... కొత్త మంత్రులకు సహకరించండి: చంద్రబాబు

sivanagaprasad kodati |  
Published : Nov 11, 2018, 05:58 PM IST
ఫరూఖ్ చాలా ముదురు... కొత్త మంత్రులకు సహకరించండి: చంద్రబాబు

సారాంశం

కొత్తగా మంత్రివర్గంలోకి వచ్చిన వారికి అందరూ సహకరించాలన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఉండవల్లిలోని ప్రజావేదిక వద్ద కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన ..కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు

కొత్తగా మంత్రివర్గంలోకి వచ్చిన వారికి అందరూ సహకరించాలన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఉండవల్లిలోని ప్రజావేదిక వద్ద కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన ..కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు.

ఎన్నడూ లేని విధంగా ముస్లిం, మైనారిటీ వర్గాలకు పదవులు ఇచ్చామన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పార్టీ గెలుపు కోసం అందరూ కృషి చేయాలని సీఎం పిలుపునిచ్చారు. ఫరూఖ్ చాలా ముదురని.. టీడీపీ ఆవిర్భావం నుంచి వివిధ పదవులు చేపట్టారని.. ఆయన అనుభవం పార్టీకి, ప్రభుత్వానికి ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఐఏఎస్ కావాలనుకున్న శ్రావణ్ మంత్రి కావడం వినూత్న పరిణామమని.. అతనిలో సర్వేశ్వరరావును చూసుకుంటూ అందరూ అండగా నిలవాలని విజ్ఙప్తి చేశారు. కిడారి రెండో కుమారునికి గ్రూప్-1 ఉద్యోగం ఇస్తున్నామని.. కుమార్తె డాక్టర్ అవుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

అలాగే సివేరి సోమ కుమారుడు అబ్రహంను ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడిగా నియమిస్తున్నామని.. ఎవరికీ ఏ కష్టం వచ్చినా వారికి పార్టీ అండగా ఉంటుందని.. ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. నష్టపోయిన కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. 
 

ఏపీ కేబినెట్ విస్తరణ: కొత్త మంత్రుల శాఖలు ఇవే

గవర్నర్‌తో బాబు భేటీ.. జగన్‌పై దాడి కేసు వివరాలు అడిగిన నరసింహాన్

జగన్‌పై దాడి ఎఫెక్ట్: గవర్నర్‌ను కలవని బాబు.. ప్రమాణ స్వీకారం వరకే

బాబు కేబినెట్లోకి ఫరూక్, శ్రవణ్‌లు: భావోద్వేగానికి గురైన శ్రవణ్ తల్లి

అరకు నుంచి అమాత్యుడిగా కిడారి శ్రవణ్

కొత్తమంత్రులకు శాఖలు కేటాయింపు, ప్రమాణ స్వీకారమే తరువాయి

చిన్నోడివైనా అవకాశం ఇచ్చా, మంచి పేరు తీసుకురా:శ్రవణ్ తో చంద్రబాబు

షరీఫ్‌కు మండలి ఛైర్మెన్, చాంద్ భాషాకు విప్

మంత్రి పదవి ఆశించా, కౌన్సిల్ చైర్మన్ అయినా ఒకే:షరీఫ్

మంత్రివర్గంలో మైనార్టీలకు చోటుపై చంద్రబాబు వివరణ

కిడారి కుమారుడికి మంత్రి పదవి.. తొలిసారి స్పందించిన శ్రవణ్

PREV
click me!

Recommended Stories

Rain Alert: వాయుగుండంగా మారిన అల్పపీడ‌నం.. ఈ ప్రాంతాల్లో వ‌ర్షాలే వ‌ర్షాలు
YS Jagan Pressmeet: చంద్రబాబు, పవన్ పై జగన్ సంచలన కామెంట్స్ | Asianet News Telugu