పార్టీ మారి బూరెల బుట్టలో పడ్డ అవంతి శ్రీనివాస్

By narsimha lodeFirst Published Jun 7, 2019, 8:05 PM IST
Highlights

చివరి నిమిషంలో వైసీపీలో చేరినా  అవంతి శ్రీనివాస్‌కు వైఎస్ జగన్ కేబినెట్‌లో మంత్రి పదవిని దక్కింది. టీడీపీలో ఉంటే ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం దక్కదని భావించి ఏకంగా పార్టీ మారి మంత్రి పదవిని స్వీకరించబోతున్నారు.

అమరావతి: చివరి నిమిషంలో వైసీపీలో చేరినా  అవంతి శ్రీనివాస్‌కు వైఎస్ జగన్ కేబినెట్‌లో మంత్రి పదవిని దక్కింది. టీడీపీలో ఉంటే ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం దక్కదని భావించి ఏకంగా పార్టీ మారి మంత్రి పదవిని స్వీకరించబోతున్నారు.

2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ నుండి  అవంతి శ్రీనివాస్ టీడీపీలో చేరారు. అనకాపల్లి ఎంపీ స్థానం నుండి అవంతి శ్రీనివాస్  టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే  2019 ఎన్నికల్లో అవంతి శ్రీనివాస్ భీమిలి నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించారు. కానీ, టీడీపీలో ఉంటే ఈ అవకాశం దక్కదని భావించారు.

టీడీపీ ఎంపీగా ఉంటూనే ఎన్నికలకు ముందుగానే అవంతి శ్రీనివాస్ వైసీపీలో చేరారు. వైసీపీ అభ్యర్ధిగా అవంతి శ్రీనివాస్ భీమిలి నుండి పోటీ చేశారు. అవంతి శ్రీనివాస్ పై మాజీ మంత్రి సబ్బం హరి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.

కాపు సామాజిక వర్గం నుండి  టీడీపీ నుండి చివరి నిమిషంలో  వైసీపీలో చేరినప్పటికీ అవంతి శ్రీనివాస్ కు జగన్ తన మంత్రివర్గంలో చోటు కల్పించారు. 
చంద్రబాబు కేబినెట్‌లో ఇదే అసెంబ్లీ నియోజకవర్గం నుండి విజయం సాధించిన గంటా శ్రీనివాసరావు  మంత్రిగా కొనసాగారు. ఈ దఫా గంటా శ్రీనివాసరావు విశాఖ ఉత్తర నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు.

సంబంధిత వార్తలు

రెండు సార్లు రోజాతో భేటీ: బుజ్జగించిన వైఎస్ జగన్

రోజాకు జబర్ధస్త్ షాక్: జగన్ కొలువులో 25 మంది వీరే
సీనియర్లకు షాక్: విధేయులకే జగన్ పట్టం

వైఎస్ జగన్ మంత్రుల ప్రమాణస్వీకారానికి ముహుర్తం ఇదే

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా కోన రఘుపతి

రోజాకు జబర్ధస్త్ షాక్: జగన్ కొలువులో 25 మంది వీరే

చంద్రబాబుకు కౌంటర్: నామినేటేడ్ పోస్టుల్లో బీసీలకు పెద్దపీట

జగన్‌లో ఊహించని మార్పు: వైసీపీ ఎమ్మెల్యేల జోష్

ప్రమాణానికి రెడీగా ఉండండి, సాయంత్రం విజయసాయి ఫోన్లు: జగన్

నాతో పాటు ఇబ్బందులు పడ్డారు: వైఎస్‌ఆర్‌సీఎల్పీ సమావేశంలో జగన్ భావోద్వేగం

జగన్ కేబినెట్‌లో ఐదుగురు డిప్యూటీ సీఎంలు, వీరే?

మంత్రివర్గం ఏర్పాటుపై జగన్ సంచలన నిర్ణయం

రాష్ట్రమంతా మనవైపే చూస్తుంది: ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం

విజయసాయి ఫోన్లు: జగన్ కొలువులో మంత్రులు వీరే (లైవ్ అప్‌డేట్స్)

 

click me!