జగన్ పై దాడి కేసు.. నేడు హైకోర్టులో విచారణ

By ramya neerukondaFirst Published Nov 13, 2018, 9:43 AM IST
Highlights

ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ పై దాడి కేసులో మంగళవారం హైకోర్టులో విచారణ జరగనుంది.

ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ పై దాడి కేసులో మంగళవారం హైకోర్టులో విచారణ జరగనుంది. విశాఖపట్టణం ఎయిర్‌పోర్టులో వైఎస్ జగన్‌పై కోడి కత్తితో శ్రీనివాసరావు అనే యువకుడు దాడికి పాల్పడ్డ విషయం తెలిసిందే. ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది.

అయితే.. తనపై హత్యాయత్నం జరిగిందంటూ జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జగన్ వేసిన పిటిషన్ పై గత శుక్రవారం విచారణ చేపట్టిన హైకోర్టు ఇరువాదనలు విని తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. అయితే ఈ కేసులో సిట్ అధికారుల పురోగతి నివేదికను సీల్డ్ కవర్ లో మంగళవారం కోర్టుకు సమర్పించాలని అటార్నీ జనరల్ కు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.   

కాగా... 18 రోజులుగా దర్యాప్తు నిర్వహించిన సిట్ 40 పేజీల నివేదికను తయారు చేసింది. జగన్ పై దాడి జరిగిన అనంతరం ఇప్పటి వరకు 75 మందికి పైగా వ్యక్తులను విచారించింది. 

విచారణ అనంతరం 40 పేజీల నివేదికను సీల్డ్ కవర్ లో పొందుపరచారు. ఆ నివేదికన సిట్ ఇంచార్జ్ నాగేశ్వరరావు హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ లోని అడ్వకేట్ జనరల్ ను కలిసి నివేదిక సమర్పించారు. విచారణకు సంబంధించి చర్చించారు. మంగళవారం జగన్ పై దాడి కేసు విచారణ రానున్న నేపథ్యంలో సిట్ నివేదికను అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు సమర్పించనున్నారు.   దాడి కేసు దర్యాప్తు వివరాల సీల్డ్‌ కవర్‌ను అడ్వొకేట్‌ జనరల్‌ నేడు హైకోర్టుకు సమర్పించనున్నారు.

read more news

జగన్‌పై దాడి: శ్రీనివాస్‌కు 120 కాల్స్, ఎవరీ కేకే

జగన్ పై దాడి.. హైకోర్టు సంచలన కామెంట్స్

జగన్‌పై దాడి: జోగి రమేష్‌ విచారణ, గుంటూరులో ఉద్రిక్తత

జగన్ పై దాడి కేసు:విచారణకు హాజరైన జోగి రమేష్

జగన్‌పై దాడి: శ్రీనివాస్‌ కత్తి ఎలా తీసుకెళ్లాడంటే?

జగన్ మీద దాడిపై జేసి దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

జగన్‌కేసు దర్యాప్తు: శ్రీనివాస్ దుబాయ్‌లో వెల్డర్, హైద్రాబాద్‌లో కుక్

జగన్‌పై దాడి కేసులో ట్విస్ట్: ఆ యువతులే కీలకం

జగన్‌పై దాడి కేసు...శ్రీనివాస్‌ మళ్లీ జైలుకే

జగన్‌పై దాడి: శ్రీనివాసరావుకు లైడిటెక్టర్ పరీక్ష..?

జగన్‌పై దాడి: ఆ నలుగురితో శ్రీనివాసరావు సంభాషణ

జగన్‌పై దాడి: ఇద్దరు గుంటూరు మహిళల విచారణ

శివాజీని చంపి జగన్‌పైకి నెడతారు.. లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు

జగన్‌పై దాడికి ముందు శ్రీనివాస్ నుంచి ఆ మహిళకే ఎక్కువ ఫోన్ కాల్స్

శ్రీనివాస్ విచారణకు సహకరించడం లేదు, కొన్ని విషయాలు దాస్తున్నాడు:సీపీ లడ్డా

జగన్‌పై దాడి కేసు నిందితుడి హెల్త్ ఓకే: కేజీహెచ్ సీఎంఓ

జగన్‌పై దాడి: అందుకే శ్రీనివాస్‌ను కేజీహెచ్‌కు తెచ్చామని సీఐ

అందుకే జగన్‌పై దాడి చేశా: నిందితుడు శ్రీనివాస్

click me!