నిరుద్యోగులకు శుభవార్త...2,723 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

By Arun Kumar PFirst Published Nov 12, 2018, 8:40 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు తీపికబురు అందించింది. రాష్ట్రంలో పోలీస్ శాఖలోని ఖాళీలను భర్తీచేయడానికి పూనుకుంది. అందుకోసం దాదాపు 2,723 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి మెగా నోటిఫికేషన్ విడుదల చేసింది. 
 

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు తీపికబురు అందించింది. రాష్ట్రంలో పోలీస్ శాఖలోని ఖాళీలను భర్తీచేయడానికి పూనుకుంది. అందుకోసం దాదాపు 2,723 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి మెగా నోటిఫికేషన్ విడుదల చేసింది. 

ఈ ఉద్యోగాల భర్తీని మూడు భాగాలుగా విభజించి చేపట్టనున్నట్లు ఆంధ్ర ప్రదేశ్ డిజిపి ఆర్పీ ఠాకూర్ వెల్లడించారు. మొదట అభ్యర్థులకు ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించి అందులో అర్హత సాధించిన వారికి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత అంతిమంగా వ్రాత పరీక్ష నిర్వహించడం ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని డిజిపి తెలిపారు. 

పోలీస్ శాఖలోని సివిల్, ఏఆర్‌, ఏపీఎస్పీ, ఫైర్‌మెన్‌, వార్డర్స్ కేటగిరిల్లోని ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు ఈరోజు(సోమవారం)  అంటే 12వ తేదీ నుండి  డిసెంబర్ 7 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. వయూపరిమితి పెంపు అంశం ఇంకా ప్రభుత్వ పరిశీలనలో ఉందని...వారి ఆదేశాలను బట్టి సడలింపు నిర్ణయం  తీసుకుంటామన్నారు. వచ్చే ఏడాది ఎప్రిల్ వరకు ఈ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు ఠాకూర్ వెల్లడించారు.

ఈ నియామకాల కోసం షెడ్యూల్ ఇలా ఉంది. 

నవంబర్ 12వ తేదీ నుండి  డిసెంబర్ 7తేదీ వరకు దరఖాస్తులు

జనవరి 6న ప్రిలిమినరీ రాత పరీక్ష

 ఫిబ్రవరి రెండో వారంలో దేహ దారుఢ్య పరీక్షలు

 మార్చి నెల మొదటి వారంలో అంతిమ లిఖిత పరీక్ష 

మార్చి నెలాఖరుకు పరీక్ష ఫలితాలు

ఎప్రిల్ లో నియామక ప్రక్రియ

click me!