టీడీపీని మూసేస్తారా..? లేక రాజకీయ సన్యాసం తీసుకుంటారా..?: చంద్రబాబూకు మంత్రి అనిల్ సవాల్

By Nagaraju penumala  |  First Published Sep 24, 2019, 11:30 AM IST

రాబోయే రెండేళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. రెండేళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తే చంద్రబాబు నాయుడు రాజకీయ సన్యాసం తీసుకుంటారా లేకపోతే టీడీపీని మూసివేస్తారా అంటూ సవాల్ విసిరారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్. 


అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు నాయుడు అనవసర రాద్ధాంతం చేస్తున్నారంటూ మండిపడ్డారు. 

పోలవరం ప్రాజెక్టు పనులను నవంబర్ నుంచి ప్రారంభిస్తామని పదేపదే చెప్తున్నా పనులు నిలిపివేశారంటూ చంద్రబాబు నాయుడు గగ్గోలు పెట్టడం దారుణమన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం కమిషన్లు కోసమే పనిచేసిందని ఆరోపించారు. 

Latest Videos

అయితే వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ప్రభుత్వ ధనాన్ని ఆదా చేసేంందుకు ప్రయత్నిస్తోందని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.780 కోట్లు ఆదా చేసినట్లు తెలిపారు. 

పోలవరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్రానికి ఆదాయం సమకూర్చే విధంగా సీఎం వైయస్ జగన్ ముందుకు వెళ్తుంటే దాన్ని అడ్డుకునేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు. 

రివర్స్ టెండరింగ్ వల్ల తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అవినీతి బండారం బయటపడుతుందన్న ఆందోళనతో లేనిపోని హంగామా చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. పారదర్శకంగా రివర్స్ టెండరింగ్ ను నిర్వహిస్తుంటే దానిపై అనవసర రాద్దాంతం చేస్తున్నారంటూ మండిపడ్డారు అనిల్ కుమార్ యాదవ్. 

రాబోయే రెండేళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. రెండేళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తే చంద్రబాబు నాయుడు రాజకీయ సన్యాసం తీసుకుంటారా లేకపోతే టీడీపీని మూసివేస్తారా అంటూ సవాల్ విసిరారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్. 

ఈ వార్తలు కూడా చదవండి

రివర్స్ టెండరింగ్ ఓ కుట్ర, సన్నిహితుల కోసమే ఆ డ్రామా: మాజీమంత్రి దేవినేని ఉమా

జగన్ ఖాతాలో మరో విజయం: రివర్స్ టెండరింగ్ లో రూ.686 కోట్లు ఆదా

జగన్ రివర్స్ టెండరింగ్ గ్రాండ్ సక్సెస్: తొలి ప్రయత్నంలో రూ.58 కోట్లు ఆదా

రివర్స్ టెండరింగ్ అంటే ఉలుకెందుకు: చంద్రబాబుకు మంత్రి అనిల్ కౌంటర్

గతంలో ఫెయిల్ అయిన మ్యాక్స్ ఇన్ ఫ్రాకు టెండరా...: దేవినేని ఉమా

తక్కువ ఖర్చుతో ప్రాజెక్టుల నిర్మాణం మంచిదే: రివర్స్ టెండరింగ్ సక్సెస్ పై జేసీ

అన్ని ప్రాజెక్టులకు రివర్స్ టెండరింగ్, బాబూ! చిల్లర రాజకీయాలు ఆపు: మంత్రి అనిల్

జగన్ ఏమైనా పతివ్రతా..? నీతిమంతుడిలా మాట్లాడుతున్నాడు: చంద్రబాబు ఫైర్

కాంట్రాక్టర్లకు జగన్ సర్కార్ షాక్: అడ్వాన్స్‌ ల రికవరీ

పోలవరం రివర్స్ టెండర్లు: సెప్టెంబర్ 4 తర్వాతే ముందుకు

రివర్స్ టెండరింగ్: డివిజన్ బెంచ్‌ ను ఆశ్రయించిన ఏపీ సర్కార్

షెకావత్‌తో జగన్ భేటీ:పోలవరంపై కేంద్ర మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

రీ టెండర్ల ద్వారానే పోలవరం పనులు: పెద్దిరెడ్డి

జగన్ కు కేంద్రం పిలుపు, హస్తినకు బయలుదేరిన ఏపీ సీఎం: అమిత్ షాతో భేటీ

రివర్స్ టెండరింగ్ రచ్చ: జగన్ ఢిల్లీ టూర్, ఏం జరుగుతుంది?

రివర్స్ టెండరింగ్: కేంద్రానికి పీపీఏ నివేదిక ఇదీ...

పోలవరం కాంట్రాక్ట్ రద్దుపై డివిజన్ బెంచ్ కు జగన్ సర్కార్

రివర్స్ టెండరింగ్ వద్దని హైకోర్టు చెప్పలేదు, న్యాయనిపుణులతో చర్చిస్తున్నాం: మంత్రి అనిల్

జగన్ ఇప్పుడేం చెబుతారు: పోలవరంపై హైకోర్టు ఉత్తర్వులపై బాబు

జగన్‌కు హైకోర్టు షాక్: రివర్స్ టెండరింగ్ పై మధ్యంతర ఉత్తర్వులు

తగ్గని జగన్: పోలవరం అథారిటీకి కౌంటర్
పోలవరంపై నవయుగ పిటిషన్: వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్

పోలవరం: జగన్ సర్కార్ నిర్ణయంపై కోర్టుకెక్కిన నవయుగ

జగన్‌కు షాక్: రివర్స్ టెండరింగ్‌పై పీపీఏను నివేదిక కోరిన కేంద్రం

సీఈఓ లేఖ బేఖాతరు: పోలవరం పనులకు రివర్స్ టెండర్ల ఆహ్వానం

రివర్స్ టెండరింగ్ పై సీఈఓ లేఖ: జగన్ నిర్ణయంపై ఉత్కంఠ

click me!