జగన్ పై దాడి కేసు నిందితుడికి ప్రాణ హాని..కేసును బదిలీ చేయాలంటూ...

By telugu teamFirst Published Sep 24, 2019, 10:41 AM IST
Highlights

నిందితుడు జనిపల్లి శ్రీనుకు ప్రాణహాని ఉందని అతని సోదరుడు జనిపల్లి సుబ్బరాజు, న్యాయవాది అబ్దుల్‌ సలీమ్‌ ఆరోపించారు. అతను ‘మరో మొద్దు శ్రీను’లా కాకముందే రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు. సెంట్రల్‌ జైలు వార్డర్‌, జైలర్లపై సోమవారం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం వన్‌టౌన్‌ పోలీస్ స్టేషన్‌లో వారు ఫిర్యాదు చేశారు. 

గతేడాది ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై విశాఖ ఎయిర్ పోర్టులో  శ్రీనివాస్ అనే వ్యక్తి దాడి చేసిన సంగతి తెలిసిందే. కోడి కత్తితో శ్రీనివాస్ దాడి చేశాడు. కాగా... ఈ ఘటనలో జగన్ చేతికి అప్పట్లో బలమైన గాయం తగిలింది.  అప్పటి నుంచి నిందితుడు శ్రీనివాస్ పోలీసుల కస్టడీలోనే ఉన్నాడు. దాడి జరిగిన సమయంలో జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నారు.

అయితే... నిందితుడు జనిపల్లి శ్రీనుకు ప్రాణహాని ఉందని అతని సోదరుడు జనిపల్లి సుబ్బరాజు, న్యాయవాది అబ్దుల్‌ సలీమ్‌ ఆరోపించారు. అతను ‘మరో మొద్దు శ్రీను’లా కాకముందే రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు. సెంట్రల్‌ జైలు వార్డర్‌, జైలర్లపై సోమవారం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం వన్‌టౌన్‌ పోలీస్ స్టేషన్‌లో వారు ఫిర్యాదు చేశారు. 

రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో శ్రీనును జైలర్‌, వార్డెన్‌ వేధిస్తున్నారని, ఆత్మహత్యకు ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు. తన క్లయింట్‌కు రక్షణ కల్పించాలని, ఈ కేసులో ఫిర్యాదుదారుడు సాక్షాత్తు సీఎం కావడం వల్ల ఈ కేసును కేరళకు గానీ, బెంగాల్‌కు గానీ బదలాయించాలని సలీమ్‌ విజ్ఞప్తి చేశారు.

click me!