ఏపీలో పోర్న్ వెబ్ సైట్స్ బ్యాన్

First Published May 10, 2018, 10:26 AM IST
Highlights

చంద్రబాబు సరికొత్త నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యాచారాలు అరికట్టేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లలో అశ్లీల (పోర్న్‌) సైట్లు ఓపెన్‌ కాకుండా బ్లాక్‌ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసు అధికారులను ఆదేశించారు. 

‘దాచేపల్లి’లాంటి ఘటనలు ఇక ఒక్కటి కూడా జరగడానికి వీల్లేదని స్పష్టం చేశారు. రెండు రోజుల కలెక్టర్ల సదస్సులో భాగంగా బుధవారం ఆయన అన్ని జిల్లాల ఎస్పీలతో శాంతి భద్రతల అంశంపై సమీక్షించారు. ‘‘రెండేళ్ల చిన్నారులపై బంధువులు, తెలిసినవారు అత్యాచారాలకు పాల్పడుతుండటం హేయం. పోర్న్‌ వీడియోల వల్లే ఇలాంటివి జరుగుతున్నాయి. టెక్నాలజీని తప్పుడు మార్గాల్లో వినియోగించేవారిపై కఠినంగా వ్యవహరించాలి. మహిళలు, బాలికలు, ఎస్సీ ఎస్టీలపై నేరాలకు పాల్పడేవారిని ఉక్కుపాదంతో అణచి వేయాలి’’ అని ఆదేశించారు. 

చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని శిక్షించేందుకు పోక్సో చట్ట సవరణ జరిగిందని, ఈ విషయాన్ని బాగా ప్రచారం చేసి చైతన్యం తీసుకురావాలని సూచించారు. అత్యాచార కేసులపై సత్వర విచారణకు ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సీఎస్‌, డీజీపీని ఆదేశించారు. కలెక్టర్‌-ఎస్పీ సమన్వయంతో ప్రజల్లోకి వెళితేనే ఫలితాలుంటాయని చంద్రబాబు తెలిపారు. శాంతిభద్రతల పరిస్థితి బాగుంటేనే ప్రజలు సంతోషంగా ఉంటారని పేర్కొన్నారు.

click me!