'పవన్ కళ్యాణ్ లో ఓటమి భయం.. అందుకే ప్రచారం అలా..'

By Rajesh KarampooriFirst Published May 4, 2024, 8:07 AM IST
Highlights

ఏపీ ఎన్నికల్లో రాజకీయ వేడి రోజుకు మరింతగా పెరుగుతుంది. ఈ తరుణంలో అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా వైసిపి నాయకురాలు పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎండాకాలం ఎండల కంటే పొలిటికల్ హీట్ ఎక్కువగా ఉంది. పోలింగ్ తేదీకి సమయం దగ్గర పడుతున్న కొద్ది రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. ఓ పక్క టిడిపి-జనసేన-బిజెపి కూటమి.. మరోవైపు ఒంటరిగా అధికార వైసిపి బరిలో నిలిచాయి. ఇరు వర్గాలు ఎన్నికలో తాడోపేడో తేల్చుకోవడానికి రణరంగంలో కాలు దువ్వుతున్నాయి. ఈ క్రమంలోనే అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఢీ అంటే ఢీ అనేలా పోటీపడుతూ ప్రచార బరిలో దూసుకెళ్తున్నారు. ఈ ఎన్నికల ప్రచారానికి సినీ గ్లామర్ కూడా తోడైంది. హైపర్ ఆది, హీరోయిన్ నమిత వంటి తారలు ప్రతిపక్ష కూటమికి మద్దతుగా ప్రచారం కొనసాగిస్తున్నారు. 

ఈ తరుణంలో యాంకర్, సినీ నటి, వైసీపీ నాయకురాలు శ్యామల సంచలన కామెంట్లు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని, ఎంతమంది పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నిలిచి ప్రచారం చేసిన పిఠాపురంలో వంగ గీతం మాత్రం ఓడించలేరని వైసిపి నాయకురాలు శ్యామల దీమా వ్యక్తం చేసింది. 

పవన్ కళ్యాణ్ లో ఓటమి భయం కనిపిస్తుందని, నిజంగా ఆయనకు అంత పవర్ ఉంటే ప్రచారానికి హైపర్ ఆది లాంటి వాళ్లను తన ప్రచారంలో ఎందుకు ఉపయోగించు కుంటున్నారని ప్రశ్నించింది. గ్రౌండ్ లెవెల్ లో ఉన్న రియాల్టీ ప్రజలందరికీ తెలుసని, పవన్ కు మద్దతుగా ఎంతమంది వచ్చి ప్రచారం నిర్వహించిన వైసిపి గీత గెలుపు ఖాయమని అన్నారు. వంగ గీత రాజకీయ ప్రస్థానం చూస్తే అందరికీ అర్థమవుతుందని ఆమె ఏ స్థాయి నుండి ఏ స్థాయి పెరిగారు అర్థం అవుతోందని అన్నారు. ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఓటమి ఖాయమని, ఓటమి భయంతోనే ప్రచారంలో సినీ తారలను ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. 

మేనిఫెస్టో గురించి మాట్లాడుతూ.. కూటమిగా బరిలో దిగుతారని అందరి భావిస్తుంటే.. వారి కూటమి మానిఫెస్టో రిలీజ్ సమయంలోనే కుప్పకూలిందని, మేనిఫెస్టోలో నరేంద్ర మోడీ ఫోటో లేదని, బిజెపి కూడా మేనిఫెస్టోలో మాకు సంబంధం లేదని తేల్చి చెప్పడమే వారి ఓటమి అని కామెంట్ చేశారు. వైసిపి జనాల కోసమే పని చేస్తుందని, అందుకే ఎలాంటి పార్టీలతో పొత్తులు లొసుగులు అవసరం లేదని అన్నారు. తమ పాలనలో ప్రజలకు ఎన్నో మంచి పనులు చేశామని, ఆ నమ్మకమే ఈ ఎన్నికల్లో గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీల కుట్రవల్ల ఈరోజు వృద్దులు మండుటెండల్లో బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని వారిని చూస్తుంటే కడుపు తరుక్కుపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
 

click me!