Election Commission: తెలంగాణలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) సోమవారం ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం నవంబర్ 10న నామినేషన్లకు చివరి తేదీ కాగా, నవంబర్ 3న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. నవంబర్ 30న పోలింగ్, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుంది. తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాలకు కూడా ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది.