Asianet News TeluguAsianet News Telugu

Telangana Assembly Elections 2023: సీఎం కేసీఆర్ కు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సవాల్‌

Khammam: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల నేపథ్యంలో మళ్లీ అధికారంలోకి రావ‌డానికి అన్ని వ్యూహాలు ర‌చిస్తున్న అధికార పార్టీ బీఆర్ఎస్ కు చెక్ పెట్టాల‌ని కాంగ్రెస్ చూస్తోంది. అధికారం ద‌క్కించుకోవ‌డానికి ముందున్న అన్ని వ్యూహాల‌ను సిద్ధం చేస్తోంది. దూకుడుగా ఉన్న కాంగ్రెస్.. గెలుపే ల‌క్ష్యంగా ముందుకు సాగుతోంది. ఈ క్ర‌మంలోనే తెలంగాణ కాంగ్రెస్ ప్ర‌చార క‌మిటీ క‌న్వీన‌ర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు (కేసీఆర్)కు స‌వాల్ విసిరారు.

Telangana Assembly Elections 2023: Congress leader Ponguleti Srinivas Reddy challenges CM KCR RMA
Author
First Published Sep 12, 2023, 2:11 PM IST | Last Updated Sep 12, 2023, 2:11 PM IST

Ponguleti Srinivasa Reddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న కొద్ది రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. మ‌ళ్లీ అధికారంలోకి రావ‌డానికి అన్ని వ్యూహాలు ర‌చిస్తున్న అధికార పార్టీ బీఆర్ఎస్ కు చెక్ పెట్టాల‌ని కాంగ్రెస్ చూస్తోంది. ఇదే స‌మ‌యంలో అధికారం ద‌క్కించుకోవ‌డానికి ముందున్న అన్ని వ్యూహాల‌ను సిద్ధం చేస్తోంది. దూకుడుగా ఉన్న కాంగ్రెస్.. గెలుపే ల‌క్ష్యంగా ముందుకు సాగుతోంది. ఈ క్ర‌మంలోనే తెలంగాణ కాంగ్రెస్ ప్ర‌చార క‌మిటీ క‌న్వీన‌ర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు (కేసీఆర్)కు స‌వాల్ విసిరారు. ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలోని ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేసి విజ‌యం సాధించాలంటూ స‌వాల్ విసిరారు.

రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఎన్నిక‌ల బ‌రిలో నిలిపే అభ్య‌ర్థుల‌ను ఇటీవ‌ల‌ భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) నాయ‌కుడు కేసీఆర్ ప్ర‌క‌టించారు. ఆయ‌న రెండు స్థానాల నుంచి పోటీ చేస్తాన‌ని తెలిపారు. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గ‌మైన గ‌జ్వేల్ తో పాటు కామారెడ్డి నుంచి కూడా బ‌రిలోకి దిగ‌నున్న‌ట్టు పేర్కొన్నారు. దీనిపై ప్ర‌త్య‌ర్థి పార్టీల నాయ‌కులు స్పందిస్తూ.. ఓటమి భ‌యంతోనే కేసీఆర్ రెండు స్థానాల నుంచి బ‌రిలోకి దిగ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నార‌ని విమ‌ర్శించారు. అయ‌న‌ప్ప‌టికీ రెండు స్థానాల్లోనూ కేసీఆర్ కు ఓట‌మి త‌ప్ప‌ద‌ని కాంగ్రెస్ ఘాటు వ్యాఖ్య‌లు చేసింది.

తాజాగా ఖ‌మ్మం జిల్లాకు చెందిన, తెలంగాణ కాంగ్రెస్‌ ప్రచార కమిటీ కో కన్వీనర్‌ పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందిస్తూ.. కేసీఆర్ కు సవాల్‌ విసిరారు. గ‌జ్వేల్, కామారెడ్డితో పాటు ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలోని ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేసి విజ‌యం సాధించాలంటూ పేర్కొన్నారు.  ''వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌తో పాటు మైనార్టీలు ఎక్కువగా ఉండే కామారెడ్డి నుంచి కేసీఆర్‌ పోటీ చేస్తున్నారు. అయితే, ఆ రెండు నియోజ‌క‌వ‌ర్గాల‌తో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయాలని'' పొంగులేటి స‌వాల్ విసిరారు. కేసీఆర్ ఇక్క‌డి నుంచి పోటీ చేస్తే ఆయ‌న‌పై తాను పోటీ చేస్తానంటూ పేర్కొన్నారు. బీఆర్ఎస్ ను వీడ‌టం గురించి మాట్లాడుతూ.. తనకు, కుటుంబానికి ఇబ్బందులు ఎదురవుతాయని తెలిసినా కుటుంబసభ్యులతో చర్చించాకే బీఆర్ఎస్ గుడ్ బై చెప్పాన‌నీ, ప్ర‌జ‌లు త‌న‌తో ఉన్నార‌ని చెప్పారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios