భారత్ లో కోవిడ్ -19 వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమై నేటికి ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కేంద్ర హెల్త్ మినిస్టర్ మన్సుఖ్ మాండవీయ ఆరోగ్య కార్యకర్తలు, శాస్త్రవేత్తలు, దేశ ప్రజలను అభినందించారు. ప్రధాని నరేంద్ర మోడీ ముందు చూపును కొనియాడారు.
సోమవారం నుంచి 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు, కోవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్స్ కు కరోనా వ్యాక్సిన్ ప్రికాషనరీ డోసు అందించడం ప్రారంభించారు. ఒకే రోజు వ్యవధిలో 9 లక్షల మందికి ఈ మూడో డోసు అందించామని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
థమన్ స్వల్ప లక్షణాలతో కోవిడ్ నిర్ధారణ అయ్యిందని తెలుస్తుంది. ఇక థమన్ కి కోవిడ్ సోకిందన్న వార్త తెలుకున్న అభిమానులు, సన్నిహితులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని విషెష్ తెలియజేస్తున్నారు.
బాలీవుడ్ నటి స్వర భాస్కర్ కి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. తనను కలిసి వారందరూ కోవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
జమ్మూ కాశ్మీర్ లో కరోనా కేసులు పెరుగుతుండటంతో రాత్రి 9 నుంచి ఉదయం 6 వరకు ఆంక్షలు విధించారు. కేవలం అత్యవసర సేవలకు మాత్రమే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని చెప్పింది.