బాలీవుడ్ నటి స్వర భాస్కర్ కి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. తనను కలిసి వారందరూ కోవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. 

కరోనా వైరస్ (Corona Virus) చిత్ర ప్రముఖులపై పంజా విసురుతుంది. వరుసగా నటులు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా బాలీవుడ్ నటి స్వర భాస్కర్ కి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. తనను కలిసి వారందరూ కోవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. స్వర భాస్కర్ ఇంస్టాగ్రామ్ లో... 'జనవరి 5న నిర్వహించిన వైద్యపరీక్షల్లో నాకు కోవిడ్‌ పాజిటివ్‌ అని తేలింది.దీనితో 5వ తేదీ నుండి నేను, కుటుంబ సభ్యులు ఐసోలేషన్‌లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము. ఈ మధ్య నన్ను కలిసిన వారంతా టెస్టులు చేయించుకోవాలి' అని సూచించింది. డబుల్‌ మాస్క్‌ దరించి సురక్షితంగా ఉండాలని, ఇప్పటికే డబుల్‌ డోస్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్నందున త్వరలోనే నెగిటివ్‌ వస్తుందని ఆశిస్తున్నా అని పేర్కొంది. 

ఇక స్వర భాస్కర్ (Swara Bhasker)కి కరోనా అని తెలుసుకున్న ఆమె ఫ్యాన్స్,శ్రేయోభిలాషులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఆమె త్వరగా కోలుకోవాలని విషెస్ తెలియజేస్తున్నారు. 2009లో నటిగా ఎంట్రీ ఇచ్చిన స్వర భాస్కర్ అనేక బాలీవుడ్ సినిమాలు సిరీస్లు, టెలివిజన్ సీరియల్స్ లో నటించారు. తను వెడ్స్ మను, వీరి ది వెడ్డింగ్ లాంటి సినిమాలు ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టాయి. వీరి ది వెడ్డింగ్ మూవీలో ఆమె నటించిన ఓ బోల్డ్ సన్నివేశం విమర్శల పాలైంది. ఆ వివాదం ఆమెను మరింత పాపులర్ చేసింది. 

ఇప్పటికే కరీనా కపూర్‌, ఏక్తా కపూర్‌, మంచు లక్ష్మీ కరోనా బారిన పడ్డారు. సూపర్ స్టార్ మహేష్ (Mahesh Babu)తనకు కరోనా సోకినట్లు నిన్న సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. గురువారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో మహేష్ ట్విట్టర్ వేదికగా షాకింగ్ న్యూస్ పంచుకున్నారు. ఆయన తనకు కరోనా సోకినట్లు వెల్లడించారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ స్వల్ప లక్షణాలతో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఇంట్లో క్వారంటైన్ కావడంతో పాటు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నాను. నన్ను కలిసిన వారందరూ కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే అందరూ వ్యాక్సిన్ తప్పక తీసుకోండి. దాని వలన కోవిడ్ సోకినప్పటికీ రిస్క్ లేకుండా బయటపడవచ్చు... అంటూ సందేశం విడుదల చేశారు. 

మహేష్ కి కరోనా అని తెలుసుకున్న ఫ్యాన్స్, చిత్ర ప్రముఖులు, రాజకీయవేత్తలు స్పందించారు. కాగా జూనియర్ ఎన్టీఆర్ మహేష్ ట్వీట్ కి కామెంట్ చేశారు. ఎన్టీఆర్ తన ట్వీట్ లో త్వరగా కోలుకో అన్నా.. నీ ఆరోగ్యం కోసం దేవుని ప్రార్థిస్తున్నాను... అంటూ కామెంట్ చేశారు. మహేష్ ఆరోగ్యంపై ఎన్టీఆర్ స్పందించిన తీరుకు ఇద్దరు హీరోల ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక పరిశ్రమలో ఎన్టీఆర్, మహేష్ చాలా సన్నిహితంగా ఉంటారు. వీరిద్దరికీ రామ్ చరణ్ కూడా మంచి మిత్రుడు. గత ఏడాది ఎన్టీఆర్ కి కరోనా సోకిన నేపథ్యంలో మహేష్... త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్ చేశారు.