Asianet News TeluguAsianet News Telugu

corona virus : మొద‌టి రోజు 9 లక్ష‌ల మందికి ప్రికాష‌నరీ డోసు..

సోమవారం నుంచి 60 ఏళ్లు పైబ‌డిన వృద్ధుల‌కు, కోవిడ్ ఫ్రంట్ లైన్ వారియ‌ర్స్ కు క‌రోనా వ్యాక్సిన్ ప్రికాష‌న‌రీ డోసు అందించ‌డం ప్రారంభించారు. ఒకే రోజు వ్య‌వ‌ధిలో 9 ల‌క్ష‌ల మందికి ఈ మూడో డోసు అందించామ‌ని కేంద్ర ప్ర‌భుత్వ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. 

Corona virus : Precautionary dose for 9 lakh people on first day.
Author
Delhi, First Published Jan 11, 2022, 2:30 PM IST

దేశంలో క‌రోనా (corona) కేసులు పెరుగుతున్నాయి. 2019లో వెలుగులోకి వ‌చ్చిన ఈ మ‌హమ్మారీ ఇప్ప‌టికీ  మ‌నుషుల‌ని వ‌ద‌ల‌డం లేదు. మన దేశంలో 2020లో మొద‌టి వేవ్ (first wave), 2021లో రెండో వేవ్ (second wave)దేశాన్ని ప‌ట్టిపీడించాయి. ఈ స‌మ‌యంలో దేశ‌ ఆర్థిక ప‌రిస్థితి దిగ‌జారింది. ఎంద‌రో మంది నిరుద్యోగుల‌య్యారు. చాలా మంది ఉపాధి కోల్పొయారు. గ‌త రెండు వేవ్ ల అనుభ‌వాల‌ను దృష్టిలో పెట్టుకొని ఈ సారి అలాంటి ప‌రిస్థితులు ఎదురుకావ‌ద్ద‌ని కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి.

క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా అన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఆంక్ష‌లు అమ‌లు చేస్తున్నాయి. నైట్ క‌ర్ఫ్యూలు (night curfew), వీకెండ్ క‌ర్ఫ్యూలు (weekend curfew), వీకెండ్ లాక్ డౌన్ లు (weekend lock down) వంటివి విధిస్తున్నాయి. దీంతో పాటు ఇత‌ర చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. అందులో భాగంగానే వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేస్తున్నాయి. ఇప్పటి వ‌ర‌కు దేశ ప్ర‌జ‌ల‌కు 150 కోట్ల డోసులు అందాయ‌ని ఇటీవ‌లే ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ (pm narendra modi) ప్ర‌క‌టించారు. ఒమిక్రాన్ విజృంభిస్తున్న నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం మ‌రో నిర్ణ‌యం తీసుకుంది. 15-18 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సున్న పిల్ల‌ల‌కు కూడా వ్యాక్సిన్ ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది. జ‌న‌వరి 3వ తేదీ నుంచి వారికి వ్యాక్సిన్ ఇస్తున్నారు. అంత‌కు ముందు 18 ఏళ్లు పైబ‌డిన వారికి మాత్ర‌మే క‌రోనా వ్యాక్సిన్ ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది. 

టీనేజ్ పిల్ల‌ల‌తో పాటు కోవిడ్ ఫ్రంట్ లైన్ వారియ‌ర్స్ (front line wariars), 60 ఏళ్లు పైబ‌డిన వృద్ధుల‌కు కూడా మ‌రో డోసు అధ‌నంగా ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది. కోవిడ్ ముప్పు అధికంగా ఉండే వారికి ఒక డోసు అధ‌నంగా ఇవ్వడం వ‌ల్ల వారు సుర‌క్షితంగా ఉంటార‌ని ప్ర‌భుత్వం భావించింది. అయితే ఈ అధ‌న‌పు డోసును బూస్ట‌ర్ డోసు (booster dose)అని పేర్కొన‌కుండా ప్రికాష‌న‌రీ డోసు (precautionary dose) అని పేర్కొంది. ఈ ప్రికాష‌న‌రీ డోసును ఈ నెల ప‌దో తేదీ నుంచి ఇవ్వ‌డం ప్రారంభించింది. ఈ ప్రికాష‌న‌రీ డోసు కోసం ఎలాంటి రిజిస్ట్రేష‌న్ అవ‌స‌రం లేద‌ని తెలిపింది. నేరుగా వ్యాక్సినేష‌న్ సెంట‌ర్ కు (vaccination center)  వెళ్లి వృద్ధులు డాక్ట‌ర్ స‌ల‌హా మేర‌కు ఈ వ్యాక్సిన్ వేసుకోవ‌చ్చ‌ని చెప్పింది. 

సోమవారం ప్రారంభ‌మైన ఈ ప్రికాష‌న‌రీ డోసు కార్య‌క్ర‌మం మొద‌టి రోజు  విజ‌య‌వంతం అయ్యింది. దేశ వ్యాప్తంగా  9 లక్షల మంది లబ్ధిదారులు ఈ ప్రికాష‌నరీ డోసు వేసుకున్నార‌ని కేంద్ర ప్ర‌భుత్వ వ‌ర్గాలు విడుద‌ల చేసిన డేటాలో వెల్ల‌డించాయి. మొద‌టి రోజు చేప‌ట్టిన వ్యాక్సినేష‌న్ డ్రైవ్ లో  9,84,676 మందికి మూడో డోసు అందింద‌ని తెలిపాయి. వీరిలో 5,19,604 మంది హెల్త్ వ‌ర్క‌ర్స్, 2,01,205 మంది ఫ్రంట్‌లైన్ కార్మికులు,  2,63,867 మంది 60 ఏళ్లు పైబ‌డిన వృద్ధులు ఉన్నారు. అయితే ఈ ప్రికాష‌న‌రీ డోసు పొందాలంటే రెండో డోసు పూర్తి చేసుకొని 9 నెల‌లు లేదా 39 వారాలు దాటి ఉండాలి. గ‌త రెండు డోసుల స‌మ‌యంలో ఏ వ్యాక్సిన్ వేశారో.. ఈ ప్రికాష‌నరీ డోసు కూడా అదే వ్యాక్సిన్ వేయ‌నున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios