భారత్ లో కోవిడ్ -19 వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమై నేటికి ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కేంద్ర హెల్త్ మినిస్టర్ మన్సుఖ్ మాండవీయ ఆరోగ్య కార్యకర్తలు, శాస్త్రవేత్తలు, దేశ ప్రజలను అభినందించారు. ప్రధాని నరేంద్ర మోడీ ముందు చూపును కొనియాడారు.
ఇండియాలో కోవిడ్ -19 (covid -19) వ్యాక్సినేషన్ డ్రైవ్ (vaccination drirve) నేటికి ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ (central health minister mansuk mandaviya) వ్యాక్సినేషన్ పై ప్రశంసలు కురిపించారు. ‘‘ప్రపంచంలో ఇది అత్యంత విజయవంతమైనది’’ అని ఆదివారం పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీని (prime minister narendra modi) ఆయన అభినందించారు.
‘‘ప్రపంచంలోనే అతిపెద్ద టీకా ప్రచారం నేటికి ఏడాది పూర్తయ్యింది. ‘సబ్కే ప్రయాస్’తో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ప్రారంభించిన ఈ ప్రచారం నేడు ప్రపంచంలో అత్యంత విజయవంతమైన టీకా’’ అని ఆయన ట్విట్టర్ (twitter) లో పేర్కొన్నారు. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన ఆరోగ్య కార్యకర్తలు, శాస్త్రవేత్తలు, దేశప్రజలందరికీ అభినందనలు తెలియజేస్తున్నానని తెలిపారు. ఈ మేరకు ఆయన హిందీలో ట్వీట్ చేశారు. ఇండియాలో వ్యాక్సినేషన్ డ్రైవ్ (vaccination drive) ప్రారంభమైన విధానం, 150 కోట్ల వరకు అది ఎలా చేరిందో చూపించే గ్రాఫ్ ను (graf) కూడా ఆయన ట్విటర్ వేధికగా పంచుకున్నారు. ‘‘ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దూరదృష్టి, స్ఫూర్తిదాయక నాయకత్వంలో కోవిడ్ -19కి (COVID -19) కి వ్యతిరేకంగా దేశం సమిష్టి పోరాటం అందించే #1YearOfVaccineDrive ప్రయాణాన్ని చూడండి’’ అంటూ ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు.
గతేడాది జనవరి 16 వ తేదీన భారతదేశంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ (vaccination drive) మొదలైంది. జూన్ 21, 2021 నుండి వ్యాక్సినేషన్ లో కొత్త దశ ప్రారంభమైంది. ఇప్పటి వరకు దేశ ప్రజలకు 156.76 కోట్ల డోసుల కోవిడ్ -19 డోసులు అందాయి. గడిచిన 24 గంటల్లో 66 లక్షలకు మందికి పైగా వ్యాక్సిన్ డోసులు అందించారు. వ్యాక్సిన్ల లభ్యత, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు వాటిని సరఫరా చేయడం, మెరుగైన ప్రణాళిక, వ్యాక్సినేషన్ చైన్ ను (vaccination chain) ఎప్పటికప్పుడు మెరుగుపర్చడం ద్వారా ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ విజయవంతం అయ్యింది.
ఇదిలా ఉండగా.. గడిచిన 24 గంటల్లో 2,71,202 కొత్త కోవిడ్ -19 (covid -19) కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కేసుల సంఖ్య 3,71,22,164కి చేరింది. గడిచిన 24 గంటల్లో కరోనాతో మరో 314 మంది మరణించారు. దీంతో దేశంలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,86,066కి చేరింది. శనివారం నాడు కరోనా నుంచి 1,38,331 మంది కోలుకున్నారు. దీంతో కరోనా (corona) నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,50,85721కి చేరింది. ఇండియాలో ప్రస్తుతం 15,50,377 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా రోజువారి పాజిటివిటీ రేటు 16.28 శాతంగా ఉంది. వీక్లీ పాజిటివిటీ రేటు 13.69 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు.. 94.51 శాతం, యాక్టివ్ కేసులు 4.18 శాతంగా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 16,65,404 కరోనా పరీక్షలు నిర్వహించన్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ (central health ministry) శనివారం ప్రకటించింది. దేశంలో ఇప్పటి వరకు 70,24,48,838 కరోనా టెస్టులు నిర్వహించినట్టు పేర్కొంది.
