జమ్మూ కాశ్మీర్ లో కరోనా కేసులు పెరుగుతుండటంతో రాత్రి 9 నుంచి ఉదయం 6 వరకు ఆంక్షలు విధించారు. కేవలం అత్యవసర సేవలకు మాత్రమే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని చెప్పింది.
దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. రోజు రోజుకు కరోనా కేసులు ఎక్కువవుతున్నాయి. కోవిడ్ -19 డెల్టా వేరియంట్ కేసులతో పాటు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు కూడా అధికంగా నమోదవుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ డెల్టా తో పోలిస్తే చాలా వేగంగా వ్యాపిస్తోంది. దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన ఈ వేరియంట్ ఇప్పుడు ప్రపంచ దేశాలను భయాందోళనలకు గురి చేస్తోంది. ఈ కొత్త వేరియంట్ దాదాపు 38 దేశాలకు వ్యాపించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారికంగా తెలిపింది. భారతదేశంలో ఈ ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుతున్నాయి.
పెరుగుతున్న ఆంక్షలు..
కరోనా కేసులు పెరుగుతుండటంతో అన్ని రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూలు విధించాయి. ఇప్పుడు ఈ జాబితాలో మరో రాష్ట్రం చేరింది. ఈ మేరకు జమ్ము కాశ్మీర్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం.. రాత్రి 9 నుంచి ఉదయం 6 వరకు ఆంక్షలు విధించింది. కేవలం అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఇచ్చింది. ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని చెప్పింది.
గుజరాత్‌లో విషాదం: గ్యాస్ లీకై ఆరుగురు మృతి, 20 మందికి గాయాలు
ఇప్పటి వరకు జమ్ము కాశ్మీర్ లో గడిచిన 24 గంటల్లో 418 కొత్త కోవిడ్-19 కేసులను నమోదయ్యాయి. అయితే ఇందులో 311 కేసులు కేవలం జమ్మూ డివిజన్ లోనే వెలుగులోకి వచ్చాయి. మిగిలిన 107 కాశ్మీర్ డివిజన్ లో నమోదయ్యాయి. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్‌లో 1,819 యాక్టివ్ కోవిడ్ (COVID-19) కేసులు ఉన్నాయి. ఇందులో జమ్మూ డివిజన్ నుంచి 894, కాశ్మీర్ డివిజన్ నుంచి 925 కేసులు ఉన్నాయి.
దేశంలో తొలి ఒమిక్రాన్ మరణం...
దేశంలో కోవిడ్ -19 (COVID-19) రెండు వేవ్‌లు ఇప్పటికే వచ్చిపోయాయి. ఈ రెండు వేవ్‌లు దేశాన్ని అతలాకుతలం చేశాయి. ఆర్థికంగా చాలా ఇబ్బందులకు గురి చేసింది. ఎంతో మంది ఉద్యోగాలు కోల్పొయారు. మరి కొందరు ఆత్మీయులను కోల్పొయారు. ఈ రెండు వేవ్ ల సమయంలో ఎంతో మంది మృతి చెందారు. అయితే ఇప్పుడు ఒమిక్రాన్ విజృంభన కొనసాగుతోంది. దాదాను నెల రోజుల వ్యవధిలోనే కేసులు సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అయితే ఇప్పటి వరకు విదేశాల్లోనే ఉన్న ఒమిక్రాన్ మరణాలు నిన్న ఇండియాలోనూ చోటు చేసుకుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా తెలిపింది. ఈ విషయంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మీడియాతో మాట్లాడారు. రాజాస్థాన్‌లో తొలి ఒమిక్రాన్ మరణం సంభవించిందని తెలిపారు. మృతుడు వృద్ధుడని, అతడు అప్పటికే షుగర్, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని అన్నారు.
ఢిల్లీ చాందినీ చౌక్ లో భారీ అగ్ని ప్రమాదం.. 60 దుకాణాలు దగ్ధం..
ఎనిమిది రోజుల్లో 6.3 రేట్ల పెరుగుదల..
దేశంలోని ప్రధాన నగరాల్లో కేసుల పెరుగుదలపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. గడిచిన 8 రోజుల్లో నగరాల్లో కోవిడ్ కేసుల సంఖ్య 6.3 రెట్లు పెరిగిందని తెలిపింది. ఇప్పటి వరకు ఒమిక్రాన్ (omicron) కేసులు దేశంలో 2,135 కేసులు నమోదయ్యాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ కొత్త వేరియంట్ కేసుల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో, ఢిల్లీ రెండో స్థానంలో ఉందని తెలిపింది. అలాగే మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, కేరళ, తమిళనాడు, కర్ణాటక, జార్ఖండ్, గుజరాత్‌లోనూ కోవిడ్ -19 కేసులు పెరుగుతున్నాయని కేంద్ర చెప్పింది. దేశంలోని 28 జిల్లాలు వారానికి 10 శాతానికి పైగా పాజిటివిటీ రేటును కలిగి ఉందని పేర్కొంది.
