Asianet News TeluguAsianet News Telugu

2011 బాన్సువాడ నిర్ణయం: హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో పోటీకి టీడీపీ సై

తెలంంగాణలో పార్టీని కాపాడుకొనేందుకు టీడీపీ నాాయకత్వం ప్రయత్నాలను ప్రారంభించింది. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేయడం కూడ ఈ నిర్ణయంలో భాగమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Reasons behind to tdp contest in huzurnagar by elections
Author
Huzur Nagar, First Published Sep 29, 2019, 7:24 AM IST

హైదరాబాద్: ఏ ఉప ఎన్నికలైనా, సాధారణ ఎన్నికలు జరిగినా పోటీ చేయాలనే నిర్ణయాన్ని తెలంగాణలో టీడీపీ అమలు చేస్తోంది. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో ఈ నిర్ణయాన్ని తీసుకొన్న తెలుగుదేశం నాయకత్వం ఆ తర్వాత రాజకీయాల్లో చోటు చేసుకొన్న మార్పు కారణంగా కొన్ని ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంది. కానీ ప్రస్తుతం హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఎన్నికల్లో పోటీకి సై అంటుంది.

ఈ ఏడాది అక్టోబర్ 21వ తేదీన  హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని టీడీపీ శనివారం నాడు నిర్ణయం తీసుకొంది.సెప్టెంబర్  29వ తేదీన అభ్యర్ధిని ప్రకటించనున్నారు.

తెలంగాణలో టీడీపీ నుండి పెద్ద ఎత్తున నాయకులు టీడీపీ, బీజేపీకి వలస వెళ్లారు. ద్వితీయ శ్రేణి నాయకులు హుజూర్ నగర్ స్థానంలో పోటీ చేయాలని చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చారు. శనివారం నాడు హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు నల్గొండ పార్లమెంట్ స్థానానికి చెందిన నేతలతో చంద్రబాబునాయుడు సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానంలో పోటీ చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ స్థానం నుండి పోటీ చేయాలని గతంలో జడ్పీటీసీ గా పనిచేసిన చావా కిరణ్మయి పోటీ చేసేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. కిరణ్మయితో పాటు మరో నేత కూడ ఈ స్థానంలో పోటీకి సిద్దంగా ఉన్నట్టు పార్టీ నాయకత్వానికి చెప్పారు.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం తీవ్ర స్థాయిలో సాగుతున్న సమయంలో టీఆర్ఎస్ నేతలు తమ పదవులకు రాజీనామాలు చేసేవారు.,దీంతో ఉప ఎన్నికలు వచ్చేవి.

2009 అసెంబ్లీ ఎన్నికల్లో బాన్సువాడ నుండి టీడీపీ అభ్యర్ధిగా ప్రస్తుత తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి విజయం సాధించారు. తెలంగాణ విషయంలో టీడీపీ నాయకత్వంతో పోచారం శ్రీనివాస్ రెడ్డి విభేదించారు. టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో 2011లో బాన్సువాడ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి.

ఆ ఎన్నికల సమయంలో తెలంగాణ సెంటిమెంట్ ను దృష్టిలో ఉంచుకొని పోటీకి దూరంగా ఉండాలని తెలంగాణకు చెందిన టీడీపీ నేతలు నిర్ణయం తీసుకొన్నారు. అయితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేసింది. తెలంగాణ సెంటిమెంట్‌ను గౌరవిస్తూ పోటీకి దూరంగా టీడీపీ ఉంది. ఈ ఎన్నికల్లో పోచారం శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు.

ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధి పోచారం శ్రీనివాస్ రెడ్డికి 83,245 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్ధి పిఎస్ఆర్ 33,356 ఓట్లు వచ్చాయి. టీడీపీ పోటీకి దూరంగా ఉన్న కారణంగా కాంగ్రెస్ కు గణనీయమైన ఓట్లు వచ్చినట్టుగా ఆనాడు టీడీపీ నాయకత్వం అభిప్రాయపడింది. పోటీకి దూరంగా ఉండడం వల్ల పార్టీకి నష్టం వాటిల్లినట్టుగా టీడీపీ నేతలు అభిప్రాయపడ్డారు.

ఇక నుండి ఏ ఎన్నికలు వచ్చినా పోటీ చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేశారు. 2014 సాధారణ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కారణంగా ఆ పార్టీకి కొన్ని స్థానాలను వదిలేసి ఇతర స్థానాల్లో టీడీపీ పోటీ చేసింది.

2014 తర్వాత తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీ తీవ్రంగా నష్టపోయింది. టీడీపీకి చెందిన కీలక నేతలు టీఆర్ఎస్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు కారణంగా ఆ పార్టీ కేవలం 13 అసెంబ్లీ స్థానాల్లోనే పోటీ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయలేదు.

కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులకు టీడీపీ మద్దతును ప్రకటించింది.టీడీపీ తీసుకొన్న నిర్ణయాలు రాజకీయంగా ఆ పార్టీని మరింత నష్టపర్చాయి. దరిమిలా హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో మద్దతివ్వాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం టీడీపీని కోరింది. కానీ, ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని టీడీపీ నిర్ణయం తీసుకొంది.

2011 లో బాన్సువాడ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత తీసుకొన్న నిర్ణయాన్ని ఇక నుండి కచ్చితంగా అమలు చేయాలని ఆ పార్టీ నాయకత్వం డిసైడ్ అయింది. ఈ కారణంగా ఈ ఎన్నికల్లో పోటీకి తమ అభ్యర్థిని దింపుతుంది.

కేసీఆర్ హుజూర్ నగర్ వ్యూహం: ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏకాకి

వీకెండ్: హుజూర్ కోసం పోరు, అజరుద్దీన్ తో వివేక్ కు కేటీఆర్ చెక్

2011 బాన్సువాడ నిర్ణయం: హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో పోటీకి టీడీపీ సై

హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఎఫెక్ట్: సర్పంచుల సంఘం అధ్యక్షుడు మిస్సింగ్?

హుజూర్ నగర్ పై చంద్రబాబు మంతనాలు: ఉత్తమ్ కు షాక్?

కోదాడలో చెల్లని పైసా హుజూర్ నగర్ లో చెల్లుతుందా: ఉత్తమ్ పై కర్నె ప్రభాకర్ ధ్వజం

హుజూర్ నగర్ ఉప ఎన్నిక... బరిలో 251మంది సర్పంచులు

కాంగ్రెస్, టీఆర్ఎస్‌లకు షాక్: హుజూర్‌నగర్ బరిలో 30 మంది లాయర్లు

ట్రక్కు లేకపోతే ఉత్తమ్ అప్పుడే ఓడిపోయేవారు: కేటీఆర్

హుజూర్‌నగర్ ఉప ఎన్నిక: బీజేపీ అభ్యర్ధి ఈమెనే

గెలుపు మనదే,50 వేల మెజారిటీ రావాలి: సైదిరెడ్డితో కేసీఆర్

హుజూర్ నగర్ చాలా హాట్ గురూ..: కేసీఆర్ కు సవాల్ ఇదే...

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: బిజెపిలోకి కాసోజు శంకరమ్మ?

హుజూర్‌నగర్ బైపోల్: సీపీఐ, జనసేన మద్దతుకు ఉత్తమ్ ప్రయత్నాలు

సైదిరెడ్డి స్థానీయత: ఉత్తమ్ ప్రకటనలోని ఆంతర్యం ఇదే...

శానంపూడి సైదిరెడ్డి ఆంధ్రవాడా: ఉత్తమ్ కుమార్ రెడ్డి భాష్యం అదే

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: జానా రెడ్డి కొడుక్కి బీజేపీ గాలం

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డే

హుజుర్ నగర్ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల : అక్టోబర్ 21న పోలింగ్

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: మళ్లీ తెర మీదికి కాసోజు శంకరమ్మ

జగదీష్ రెడ్డి వ్యాఖ్య: రేవంత్ రెడ్డితో మాట్లాడించింది ఉత్తమ్ కుమార్ రెడ్డే

హుజూర్ నగర్ అభ్యర్థి: అన్న మాటను కాదన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Follow Us:
Download App:
  • android
  • ios