మరో వారం లో మహిళల దినోత్సవం రానుంది. ప్రతి ఒక్కరి జీవితంలో మహిళ కీలక పాత్ర పోషిస్తుంది. తల్లి, చెల్లి, భార్య, కూతురు.. ఇలా ఒక్కో పాత్ర పోషిస్తూ.. ఇంట్లో అందరి బాధ్యతలు స్త్రీ నిర్వర్తిస్తుంది. ఈ నేపథ్యంలో.. మహిళల కంటూ ప్రత్యేకంగా ఓ రోజు కేటాయించారు. అదే మహిళల దినోత్సవం.

కాగా.. ఈ మహిళల దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ బ్రాండ్ ప్రగా న్యూస్.. తాజాగా ఓ ప్రకటన రూపొందించింది. కాగా... ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఎందరో హృదయాలను తట్టిలేపుతోంది. చాలా చక్కని మెసేజ్ ఇచ్చారంటూ యాడ్ నిర్వాహకులపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ఇంతకీ ఆ వీడియోలో ఏముందో ఇప్పుడు చూద్దాం... ఓ మహిళ తన కుటుంబాన్ని ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. ఇంట్లో ప్రతి ఒక్కరి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తుంది. కానీ.. ఆమెకు తల్లి అయ్యే అదృష్టం లేదు. ఈ క్రమంలో ఆమె చాలా మానసికంగా బాధపడుతూ ఉంటుంది. అదే ఇంట్లో మరో మహిళ తల్లికాబోతూ ఉంటుంది. ఆమెకు సంబంధించిన ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఆమెలో మానసిక ఒత్తిడి మరింత పెరుగుతుంది. పైకి నవ్వుతూనే ఉన్నా.. తాను కూడా తల్లి కాలేకపోతున్నానంటూ మనసులోనే రోదిస్తుంది. అయితే.. తల్లి కాలేకపోయినా.. ఇంటి బాధ్యతలు మొత్తం ఆమె ఎంతో చక్కగా నిర్వరిస్తుందని.. తనకు పుట్టబోయే బిడ్డకు ఆమె పేరే పెడతానంటూ తోటి కోడలు చెప్పడం అందరినీ ఆకట్టుకుంది. కాగా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ఆకట్టుకుంటన్న వీడియోని మీరు ఈ కింద చూడొచ్చు.

 

మన సమాజంలో చాలా మంది ఫెర్టిలిటీ సమస్యలతో బాధపడుతున్నారని.. దాని వల్ల సంతానం లేక చాలా మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారని చివరల్లో ఇచ్చిన మెసేజ్ ఆకట్టుకుంటోంది. 

ఇంటి బాధ్యతలు నిర్వర్తించే పెద్ద కోడలి పాత్రలో మోనా సింగ్ అద్భుతంగా నటించారు. ఆమె తన తోటి కోడలు తల్లి కావడాన్ని చాలా ఆనందిస్తూనే.. తనకు పిల్లలు లేరని బాధపడుతుంది. కానీ.. ఆమెను కుటుంబసభ్యులు అర్థం చేసుకున్న తీరు ఆకట్టుకుంటోంది. 

ఈ వీడియోని గత ఆదివారం విడుదల చేయగా.. విపరీతమైన వ్యూస్ సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు 1.7 మిలియన్లకు పైగా వ్యూస్ ఈ వీడియో అందుకుంది.