Asianet News TeluguAsianet News Telugu

ఈ గుడికి పీరియడ్స్ లో కూడా వెళ్లొచ్చు..!

ఈ గుడిలో మాత్రం అర్చకులు కూడా మహిళలే ఉండటం విశేషం. ఈ ఆలయం తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకోగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
 

Woman allow these temple on periods ram
Author
First Published Oct 24, 2023, 3:58 PM IST | Last Updated Oct 24, 2023, 3:58 PM IST

మన దేశంలో దేవాలయాలకు అందరూ వెళ్తూనే ఉంటారు. అయితే, పీరియడ్స్ సమయంలో మాత్రం మహిళలు ఆలయాలకు వెళ్లరు. ఇది మన దగ్గర నిషేధం.  కేవలం ఆలయానికి వెళ్లడమే కాదు, పీరియడ్స్ సమయంలో ఇంట్లో పూజలు కూడా చేయరు. కనీసం శుభకార్యాలయాలకు కూడా హాజరు కారు. అయితే, ఓ ఆలయంలో మాత్రం  మీరు పీరియడ్స్ లో ఉన్నా కూడా  వెళ్లొచ్చు. 

ఈ ఆలయంలో మరో ప్రత్యేకత కూడా ఉంది. ఈ ఆలయానికి స్త్రీ పురుషులు ఎవరైనా వెళ్లొచ్చు. కానీ,  ఆలయంలో పూజ మాత్రం స్త్రీలు మాత్రమే చేస్తారు. నిజానికి, మనం ఏ ఆలయంలో చూసినా అర్చకులు పురుషులు మాత్రేమే ఉంటారు. అయితే, ఈ గుడిలో మాత్రం అర్చకులు కూడా మహిళలే ఉండటం విశేషం. ఈ ఆలయం తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకోగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కోయంబత్తూర్‌లోని  "మ లింగ భైరవి" అని పిలువబడే ఒక ప్రత్యేకమైన ఆలయం మహిళలు రుతుక్రమం సమయంలో కూడా అమ్మవారిని ఆరాధించడానికి అనుమతిస్తుంది.

మలింగ భైరవి ఆలయానికి పురుషులు, మహిళలు ఇద్దరూ పూజలు చేయడానికి వస్తారు, అయితే గర్భగుడిలోకి ప్రవేశించి అమ్మవారిని పూజించడానికి మహిళలకు మాత్రమే అనుమతి ఉంది. సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆశ్రమంలో  ఈ ఆలయం ఉండటం విశేషం.

భారతదేశంలోని అనేక ప్రాంతాలలో, ఋతుస్రావం ఇప్పటికీ హిందూ విశ్వాసంలో  అపవిత్రంగా పరిగణిస్తారు.రుతుక్రమంలో ఉన్న బాలికలు , స్త్రీలు ప్రార్థనలు చేయడ, పవిత్ర పుస్తకాలను తాకడం నుండి పరిమితం చేశారు. ఈ ఆలయం ప్రబలంగా ఉన్న నిషేధాల గురించి సమాజానికి సానుకూల సందేశాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios