చలికాలంలో జట్టు మెరిసిపోవాలంటే...

కోడిగుడ్డు తెల్ల సొన, అరటిపండులో జట్టు ప్రకాశవంతంగా మారడానికి, జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి ఉపయోగపడే ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. వీటితో తయారు చేసిన హెయిర్ ప్యాక్ వేసుకుంటే...  జట్టు ఆరోగ్యంగాను, అందంగాను ఉంటుందని చెబుతున్నారు.

Winter Hair Care Tips for Healthy Hair and Scalp

చలికాలం వచ్చిందంటే చాలు జట్టు నిర్జీవంగా మారిపోతుంది. ఎన్ని ఖరీదైన షాంపూలు, నూనెలు వాడినా పెద్దగా ప్రయోజనం ఏమీ కనపడదు. అయితే... కొన్ని రకాల సహజ ఉత్పత్తులతో జట్టుని ఆరోగ్యంగా చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
 
కోడిగుడ్డు తెల్ల సొన, అరటిపండులో జట్టు ప్రకాశవంతంగా మారడానికి, జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి ఉపయోగపడే ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. వీటితో తయారు చేసిన హెయిర్ ప్యాక్ వేసుకుంటే...  జట్టు ఆరోగ్యంగాను, అందంగాను ఉంటుందని చెబుతున్నారు.

గర్భనిరోదక మాత్రలను ఇంతలా వాడేస్తున్నారా?

ఈ హోయిర్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.. కోడిగుడ్డు, తేనె, అరటిపండు, మూడు స్పూన్ల తేనె, మూడు స్పూన్ల పాలు, ఐదు టేబుల్ స్పూన్ల ఆలివ్ నూనె... అన్నింటినీ బాగా కలపాలి. ఆ తర్వాత ఆ ప్యాక్ ని జట్టు కుదుళ్ల నుంచి  చివరి వరకు బాగా పట్టించాలి. గంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసి... గాఢత తక్కువ ఉన్న షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే.... జుట్టు అందంగా, ఆరోగ్యంగా పెరుగుతుంది. 

ఈ హెయిర్ ప్యాక్... సహజసిద్ధమైన కండిషనర్ లాగా పనిచేస్తుంది. గుడ్డు, పెరుగుతో కూడా జట్టును అందంగా మార్చుకోవచ్చు. ముందుగా కోడిగుడ్డు తీసుకొని దానిని బాగా గిలకొట్టాలి. తర్వాత అందులో నాలుగు టేబుల్ స్పూన్ల పెరుగు, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం కలపాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని బాగా కలిపి.. తర్వాత జుట్టుకి పట్టించాలి. అలా గంటచేసి ఉంచి తర్వాత... నీటితో శుభ్రం చేయాలి. అలా తరచూ చేస్తూ ఉంటే... జట్టు మెరుస్తూ... అందంగా తయారౌతుంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios