Asianet News TeluguAsianet News Telugu

పీరియడ్స్ లో తక్కువ బ్లీడింగ్.. కారణాలేంటో తెలుసా?

చాలామందికి పీరియడ్స్ రెగ్యులర్ గా అవుతుంటాయి. కానీ బ్లీడింగ్ మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. కొంతమందికి ఐదు రోజులు కావాల్సిన బ్లీడింగ్ ఒకటి రెండు రోజులు మాత్రమే అవుతుంటాయి. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా? 

what are the reason for light bleeding during periods rsl
Author
First Published Aug 27, 2024, 9:47 AM IST | Last Updated Aug 27, 2024, 9:47 AM IST


పీరియడ్స్ ప్రతి ఒక్క స్త్రీకి చాలా సహజ ప్రక్రియ. ఆడవారి పునరుత్పత్తి వ్యవస్థలో రుతుస్రావం అనేది ఒక భాగం. కానీ ఈ పీరియడ్స్ ప్రతి ఒక్క  మహిళకు ఒకేవిధంగా ఉండదు. కొంతమంది మహిళల్లో పీరియడ్స్ సమయంలో చాలా తేలికపాటి రక్తస్రావం అవుతుంది. కొన్నిసార్లు ఇది సాధారణంగా అనిపిస్తుంది. కొందరికి కావాల్సిన దానికంటే మరీ ఎక్కువ బ్లీడింగ్ అవుతుంటుంది. కానీ తేలికపాటి రక్తస్రావం మంచిది కాదు. అసలు ఇలా బ్లీడింగ్ తక్కువ ఎందుకు అవుతుంది? దీనికి టెన్షన్ పడాలా? వద్దా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

పీరియడ్స్ టైం లో తేలికపాటి రక్తస్రావం కావడానికి హార్మోన్ల అసమతుల్యత ఒక ప్రధాన కారణం. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ వంటి హార్మోన్లు రుతుచక్రాన్ని నియంత్రిస్తాయి. అయితే ఈ హార్మోన్లలో ఏదానికైనా అంతరాయం కలిగితే అది రక్త ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుంది. మీ శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయిలు లేకపోవడం వల్ల గర్భాశయ పొర సన్నబడుతుంది. దీంతో పీరియడ్స్ బ్లీడింగ్ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. 

అలాగే పిల్లలు ఇప్పుడే వద్దు అనుకునే వారు చాలా మంది గర్భనిరోధక మాత్రలను వాడుతుంటారు. కానీ ఇది పీరియడ్స్ లో మార్పులకు దారితీస్తుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఈ గర్భనిరోధకాలు ఎప్పుడూ  అండోత్సర్గమును అణచివేసి గర్భాశయం యొక్క పొరను విడదీస్తాయి. ఇది రుతుస్రావాన్ని తేలికగా లేదా మిస్ అయ్యేలా చేస్తుంది.

పీరియడ్స్ బ్లీడింగ్ తక్కువగా కావడానికి మరొక కారణం.. రుతువిరతికి చేరుకోవడం. అవును ఈ సమయంలో హార్మోన్ల స్థాయిలు తక్కువగా ఉంటాయి. ఇది బ్లీడింగ్ తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పెరిమెనోపాజ్ టైంలో రక్తస్రావం తక్కువగా ఉండటం సాధారణం.

శరీర జీవక్రియ, హార్మోన్ల ఉత్పత్తిని నియంత్రించడంలో థైరాయిడ్ గ్రంథి కీలక పాత్ర పోషిస్తుంది. అయితే హైపర్ థైరాయిడిజం , హైపోథైరాయిడిజం రెండూ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కు కారణమవుతాయి. ఇది కూడా పీరియడ్స్ బ్లీడింగ్ తగ్గడానికి కారణమవుతుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios