ఇదొక్కటి చేస్తే మీ జుట్టు పొడుగ్గా పెరుగుతుంది
జుట్టు పొడుగ్గా, ఒత్తుగా పెరగాలన్న కోరిక ప్రతి అమ్మాయికీ ఉంటుంది. కానీ చాలా మంది పొట్టి జుట్టే ఉంటుంది. మీరు కొన్ని పనులు చేస్తే మీ జుట్టు కూడా పొడుగ్గా పెరుగుతుంది. అదెలాగంటే?
అందమైన, పొడవాటి, నల్లని జుట్టును ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. కానీ సరైన సంరక్షణ లేకపోవడం వల్ల చాలా మందికి పొట్టి జుట్టే ఉంటుంది. మీరు గనుకు కొన్ని పనులు చేస్తే మీ జుట్టు కూడా పొడుగ్గా పెరుగుతుంది. ఇందుకోసం ఏం చేయాలో తెలుసుకుందాం పదండి.
ఆహారంలో మార్పులు: మీకు తెలుసా? మన జుట్టు ప్రధానంగా కెరాటిన్ తోనే తయారవుతుంది. ఇది ఒక రకమైన ప్రోటీన్. ఇది గుడ్లు, చేపలు, సన్నని మాంసాలు, బీన్స్ వంటి ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాల్లో ఉంటుంది. అందుకే జుట్టు పెరగడానికి వీటిని మీ రోజువారి ఆహారంలో చేర్చండి.
నెత్తిమీద మసాజ్ : నెత్తిని ఎంత మసాజ్ చేస్తే మీ జుట్టు అంత పొడుగ్గా పెరుగుతుంది. నెత్తిని మసాజ్ చేయడం వల్ల మన జుట్టు కుదుళ్లకు రక్త ప్రవాహం పెరుగుతుంది. ఇది జుట్టు మూలాలను బలంగాచేస్తుంది. దీంతో జుట్టు ఊడిపోయే అవకాశం ఉంది. అందుకే ప్రతిరోజూ మీ నెత్తిమీద 10 నిమిషాలు సున్నితంగా మసాజ్ చేయండి. ఇందుకోసం గోరువెచ్చని కొబ్బరి, బాదం లేదా ఆలివ్ ఆయిల్ ను తలకు అప్లై చేసి బాగా మసాజ్ చేయడి.
పెద్ద దంతాలతో దువ్వండి: ఎప్పుడైనా సరే జుట్టును పెద్ద పెద్ద దంతాలున్న దువ్వెనతోనే ముందుగా దువ్వాలి. దీనివల్ల చిక్కులు సులువుగా తొలగిపోతాయి. వెంట్రుకలు కూడా ఎక్కువగా రాలవు. మరొక ముఖ్యమైన విషయమేంటంటే? తడి జుట్టును అస్సలు దువ్వకూడదు.
ట్రిమ్ జుట్టు: తరచుగా స్టైలింగ్ చేయడం వల్ల జుట్టు చీలిపోతుంది. ఇలాంటి పరిస్థితిలో జుట్టు తెగిపోయి సన్నగా మారుతుంది. అందుకే 6-8 వారాల్లో మీ జుట్టు చివర్లను కట్ చేయండి. ఇది జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది.
డీప్ కండిషనింగ్: మీ జుట్టుకు పోషకాలను అందించడానికి, హైడ్రేట్ చేయడానికి వారానికి ఒకసారి డీప్ కండిషనింగ్ మాస్క్ ను అప్లై చేయండి. కొబ్బరి నూనె, అవొకాడో, తేనె కలిపి ఇంట్లోనే హెయిర్ మాస్క్ తయారు చేసి ఉపయోగించొచ్చు.
ఉల్లిపాయ రసం, నల్ల నువ్వులు: సల్ఫర్ పుష్కలంగా ఉండే ఉల్లిపాయ రసం జుట్టును పెంచడానికి బాగా ఉపయోగపడుతుంది. బాణలిలో నల్ల నువ్వులను వేసి బాగా వేయించండి. గ్యాస్ ఆఫ్ చేసి నల్ల నువ్వులను చల్లార్చి గ్రైండ్ చేసి ఉల్లిపాయ రసంలో కలపండి. దీన్ని తలకు అప్లై చేసి 30 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి.
కరివేపాకు, కొబ్బరినూనె : బాణలిలో అరకప్పు కొబ్బరినూనె, కరివేపాకు వేసి మరిగించండి. దీన్ని బాగా ఉడికించి స్టవ్ ఆఫ్ చేయండి. ఈ నూనె గోరువెచ్చగా అయిన తర్వాత నూనెను తలకు, జుట్టుకు బాగా పట్టించి మసాజ్ చేసి 30 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. ఆ తర్వాత హెర్బల్ షాంపూతో తలస్నానం చేసి కండీషన్ చేసుకుంటే సరిపోతుంది.