40 దాటినా యవ్వనంగా కనపడాలా? ఇవి తినకపోతే చాలు..!

 

మనం అందంగా కనపడటానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకోవడమే కాదు.. అసలు తినకూడనివి కూడా తెలుసుకోవాలి. ముఖ్యంగా 40 దాటిన మహిళలు కొన్ని ఫుడ్స్ అస్సలు తినకూడదట. అవేంటో చూద్దాం….

 

Want to look older at 40? Then you should avoid these foods ram

 

వయసు పెరుగుతున్నా కూడా అందంగా కనిపించాలనే కోరిక అందరిలోనూ ఉంటుంది. కానీ..  40 తర్వాత  మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎన్ని క్రీములు లాంటివి వాడినా కూడా ముఖంలో తేడాలు వచ్చేస్తాయి. వృద్ధాప్య ఛాయలు మొదలౌతాయి. అయితే.. కేవలం మనం వాడే బ్యూటీ ప్రొడక్ట్స్ మాత్రమే కాదు… మనం తీసుకునే ఆహారం కూడా మన అందం పై ప్రభావితం చూపిస్తుంది. మనం అందంగా కనపడటానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకోవడమే కాదు.. అసలు తినకూడనివి కూడా తెలుసుకోవాలి. ముఖ్యంగా 40 దాటిన మహిళలు కొన్ని ఫుడ్స్ అస్సలు తినకూడదట. అవేంటో చూద్దాం….

 

ఆరోగ్యానికి, అందానికి హాని చేసే ఆహారాలు తినడం వల్ల… మన అసలు వయసు కంటే పదేళ్లు పెద్దవారిలా కనిపించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. మనం తీసుకునే ఆహారం నేరుగా మన చర్మాన్ని ప్రభావితం చేస్తుంది. 



 

 షుగర్… 

 

షుగర్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల మన ముఖంలో వృద్ధాప్య ఛాయలు ఎక్కువగా కనడపతాయి. తొందరగా వయసు పెరిగిపోతుంది. స్వీట్లు, కూల్ డ్రింక్స్, చాక్లెట్స్ లలో షుగర్ ఎక్కువగా ఉంటుంది. ఇది మన చర్మంలోని కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది. దీని వల్ల చర్మం ముడతలు రావడం, వదులుగా మారుతుంది. తొందరగా వయసు మళ్లినవారిలా కనిపిస్తారు.



 

ప్రాసెస్ చేసిన ఆహారం...

మనలో చాలా మంది తరచుగా ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తింటాము, దీని వల్ల కూడా మన చర్మం దెబ్బతింటుంది. ఇది కూడా మీ చర్మంలోని కొల్లాజెన్‌ని తగ్గిస్తుంది, ఫలితంగా ముఖంపై ముడతలు ఏర్పడతాయి. కాబట్టి మీరు యవ్వనంగా కనిపించాలనుకుంటే, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి.



 

వేయించిన ఆహారాలు

 

వేయించిన ఆహారాన్ని తయారు చేయడానికి హైడ్రోజనేటెడ్ నూనెలు, రీసైకిల్ నూనెలను ఉపయోగిస్తారు. వాటిలో అధిక స్థాయిలో కొవ్వు ఉంటుంది, ఇది మన ఆరోగ్యానికి, చర్మానికి హానికరం. చర్మం పొడిబారేలా, ముడతలు వచ్చేలా  చేస్తాయి. 




 

మద్యం

చాలా మంది మద్యం మితంగా తాగుతారు, కానీ మీరు ఎక్కువగా తాగితే అది మీ ఆరోగ్యం, చర్మాన్ని దెబ్బతీస్తుంది. అధికంగా తాగడం వల్ల చర్మం డీహైడ్రేట్ అయి పొడిబారుతుంది. దీంతో చర్మం గరుకుగా, మెచ్యూర్ గా కనబడుతుంది. మన చర్మంలోని కణాల పునరుత్పత్తికి విటమిన్ ఎ అవసరం, అయితే ఆల్కహాల్ తాగడం వల్ల దాని స్థాయిలు తగ్గుతాయి, ఫలితంగా చర్మం అకాల వృద్ధాప్యానికి దారితీస్తుంది. కాబట్టి పైన పేర్కొన్న ఆహారాలకు దూరంగా ఉండండి. మీ అందాన్ని కాపాడుకోండి.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios