. ఈ పిచ్చి రోజు రోజుకీ పెరిగపోతుంది. ఎంతలా ఉంటే.. ఏకంగా ప్రైవేట్ పార్ట్స్ కి కూడా ఆపాదించేలా. ఇంతకీ మ్యాటరేంటంటే.. స్త్రీల యోని భాగాన్ని తెల్లగా చేసుకునేందుకు.. Vaginal bleaching చేయించుకుంటున్నారట. ప్రస్తుత కాలంలో ఇది ట్రెండింగ్ మారడం గమనార్హం.
రోజురోజుకీ సమాజంలో అందరికీ అందం మీద మోజు పెరుగుతోంది. మన అమ్మమ్మల కాలంలో.. అందం కోసం వెంపర్లాట ఉండేది కాదేమో. కొందరికి ఉన్నా.. ఏదో సహజంగా వంటిట్లో లభించే పసుపు, పాలు, పెరుగు లాంటివి వాడేవారు. కానీ ఇప్పుడు.. టీనేజర్ నుంచి ముసలమ్మల వరకు బ్యూటీ పార్లర్ ల వెంట పరిగెడుతున్నారు.

తలపైన వెంట్రుకల దగ్గర నుంచి.. కింద కాలి గోలి వరకు.. అన్నింటినీ అందాన్ని ఆపాదిస్తున్నారు. సహజత్వాన్ని మార్చేస్తూ.. అందం కోసం వెంపర్లాడుతున్నారు. బ్యూటీ పార్లర్ లకు వెళ్లడంతోపాటు... మార్కెట్లో లభించే అన్ని రకాల క్రీములను వాడేస్తూ ఉన్నారు.
ఇవి చేయడంలో ఎలాంటి తప్పులేదు. తమకు తాము అందంగా ఉన్నామనే భానవ లేకుంటే చాలా మందిలో ఆత్మ విశ్వాసం తగ్గిపోతుంది. అందంగా కనిపించాలని అనుకోవడం లోనూ ఎలాంటి తప్పులేదు. అయితే.. ఈ పిచ్చి రోజు రోజుకీ పెరిగపోతుంది. ఎంతలా ఉంటే.. ఏకంగా ప్రైవేట్ పార్ట్స్ కి కూడా ఆపాదించేలా. ఇంతకీ మ్యాటరేంటంటే.. స్త్రీల యోని భాగాన్ని తెల్లగా చేసుకునేందుకు.. Vaginal bleaching చేయించుకుంటున్నారట. ప్రస్తుత కాలంలో ఇది ట్రెండింగ్ మారడం గమనార్హం.

యోని బ్లీచింగ్ అంటే ఏమిటి..?
చాలా మందికి బ్లీచింగ్ గురించి అవగాహన ఉండే ఉంటుంది. తెల్లగా కనపడాలని చాలా మంది బ్లీచింగ్ చేయించుకుంటూ ఉంటారు. అయితే.. అది టెంపరరీగా ఉంటుంది. కానీ ఈ యోని బ్లీచింగ్ మాత్రం శాశ్వతం. యోని ప్రాంతం మొత్తాన్ని తెల్లగా చేస్తారు. దీని కోసం ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు ఎగపడుతూ ఉండటం గమనార్హం.
ఈ యోని బ్లీచింగ్ ని కొందరు క్రీములతో చేస్తే.. కొందరు శాశ్వతంగా ఉండేందుకు లేజర్ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు.

ఈ యోని బ్లీచింగ్ క్రేజ్ ఎక్కడి నుంచి వచ్చింది..?
గత సంవత్సరం అమెరికన్ రాపర్ కార్డి బి ఈ యోని బ్లీచింగ్ చేయించుకుంది. ఈ విషయాన్ని ఆమె ప్రకటించిన తర్వాతే.. ఈ విషయం వైరల్ అవ్వడం గమనార్హం. ఆమెకు బాడీ బ్లీచింగ్ చేయించుకోవడం ఇష్టం ఉండదట. కానీ అండర్ ఆర్మ్స్, యోని బ్లీచింగ్ మాత్రం చేయించుకుంటానని చెప్పడం గమనార్హం. ఎందకంటే ఆ ప్రాంతాలు డార్క్ గా ఉంటాయని ఆమె చెప్పింది.

అయితే.. ఈ యోని బ్లీచింగ్ చేయించుకోవాలటే ప్రొఫెషనల్స్ దగ్గర మాత్రమే చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రయోగాలు చేసి సమస్యలు తెచ్చుకోవద్దని చెబుతున్నారు. లేజిక్ అయితే.. దాదాపు మూడు సెషన్స్ లో దీనిని పూర్తి చేస్తారు.
అయితే.. లేజిక్ దాదాపు 15 నిమిషాలపాటు సాగుతుందట. ఈ ట్రీట్మెంట్ చేయించుకున్నప్పుడు శృంగారానికి దూరంగా ఉండాలట. మూడె సెషన్స్ పూర్తైయ్యిన తర్వాత కూడా కనీసం ఒక వారం పాటు ఆగాలట. ఆ తర్వాత కలయికలో పాల్గొనాలని చెబుతున్నారు.
