ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ భార్య టీనా అంబానీ.. నెటిజన్లకు సర్ ప్రైజ్ ఇచ్చారు.  ప్రపంచ ఫోటోగ్రఫీ సందర్భంగా తన కుటుంబసభ్యులకు సంబంధించిన రేర్ ఫోటోస్ ఆమె షేర్ చేశారు. తమ ఆల్బమ్ లోని అత్యంత అరుదైన, అందమైన ఫోటోలను ఆమె ఈ రోజు ఉదయం ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు.

అరుదైన ఫోటోలతో కూడిన వీడియోని షేర్ చేశారు. అందులో ఆమెతోపాటు.. అనిల్ అంబానీ, వారి కుమారులు అన్మోల్, అన్షుల్, అత్తగారు కోకిలా బెన్, మామగారు ధీరూభాయ్ అంబానీ ఉన్నారు.అంతేకాకుండా.. ఇషా అంబానీ, ఆమె భర్త ఆనంద్ పిరమల్ తోపాటు.. ఇతర కుటుంబసభ్యులందరి ఫోటోలు కూడా ఈ వీడియోలో ఉండటం గమనార్హం. 

భర్త అనిల్ అంబానీతో టీనా కలిసి దిగిన ఫోటోతో ఈ వీడియో ప్రారంభం కాగా.. వారి కుటుంబంలో జరిగిన అన్ని ముఖ్యమైన పార్టీలు, ఫంక్షన్ల సందర్భంగా తీసుకున్న ఫోటోలన్నీ ఇందులో ఉండటం గమనార్హం.

ఈ ఫోటోలకు ఆమె అద్భుతమైన క్యాప్షన్ కూడా ఇచ్చారు.ప్రతి ఒక్క ఫోటో ఒక జ్ఞాపకమని.. ప్రతి ఒక్కఫోటో ఒక్కో కథను చెబుతుందంటూ ఆమె పేర్కొన్నారు. దీనికి వరల్డ్ ఫోటో గ్రఫీ అనే హ్యాష్ ట్యాగ్ కూడా ఇచ్చారు. ఈ వీడియో ఇప్పుడు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.