Asianet News TeluguAsianet News Telugu

Viral:సినిమాటిక్ రేంజ్ లో... పెళ్లి కూతురు ఎంట్రీ... అదిరిపోయింది..!

 అలా డ్యాన్స్ లు చేసి.. ఆ వీడియోలు వైరల్ గా మారి..  ఫేమస్ అయిన వారు కూడా ఉన్నారు. తాజాగా.. ఓ వధువు.. డ్యాన్స్ వీడియో కూడా వైరల్ గా మారింది. అయితే.. ఈ వీడియో స్పెషాలిటీ ఏంటో తెలుసా..?
 

This Bride's Dance To 'Sau Aasmaan' Is Breaking The Internet
Author
Hyderabad, First Published Jan 7, 2022, 2:18 PM IST

సాధారణంగా.. పెళ్లి అనగానే.. ఏ పెళ్లి కూతురైనా సిగ్గుతో..తల దించుకొని మండపంలోకి అడుగుపెడుతుంది.  ఒకప్పుడు.. దాదాపు అన్ని పెళ్లిళ్లు అలానే జరిగేవి. కానీ.. ఇప్పుడు ట్రెండ్ మారింది. పెళ్లి మండపంలో.. పెళ్లి కూతుళ్లు.. డ్యాన్స్ చేస్తూ సందడి చేస్తున్నారు. అలా డ్యాన్స్ లు చేసి.. ఆ వీడియోలు వైరల్ గా మారి..  ఫేమస్ అయిన వారు కూడా ఉన్నారు. తాజాగా.. ఓ వధువు.. డ్యాన్స్ వీడియో కూడా వైరల్ గా మారింది. అయితే.. ఈ వీడియో స్పెషాలిటీ ఏంటో తెలుసా..?


వీడియో చూసిన వారు ఎవరూ.. ఇది రియల్ గా జరిగిన వీడియో అని అనుకోరు. ఏదో సినిమాలో హీరోయిన్ డ్యాన్స్ వీడియో అని అనుకుంటారు. అలా ఉంది పర్పార్మెన్స్.   ఆ పాట, లోకేషన్స్.. అంతా సినిమాటిక్ రేంజ్ లో ఉండటం విశేషం. సభాకపూర్ అనే ఫ్యాషన్ డిజైనర్ పెళ్లికి సంబంధించిన వీడియో అది. నిజానికి వారి పెళ్లి జరిగి కొన్ని నెలలు అవుతోంది. అయితే... ఇప్పుడు ఈ వీడియో వైరల్  కావడం విశేషం.

గురుగ్రామ్ కు చెందిన సబా కపూర్ కి.. కొన్ని నెలల క్రితం.. క్రియేటివ్ డైరెక్టర్ నివాసాను వివాహాం చేసుకున్నారు. ఆ పెళ్లిలో.. ఆమె.. తన డ్యాన్స్ తో.. పెళ్లికొడుకును సర్ ప్రైజ్ చేసింది. అంతేకాదు.. పాట చివర్లో.. ఉంగరం పట్టుకొని.. ఆమె ప్రపోజ్ చేయడం విశేషం.

 

2016లో విడుదలైన బార్ బార్ దేఖో.. సినిమాలోని  సా ఆసమాన్ పాటకు.. సభా కపూర్ అద్భుతంగా డ్యాన్స్ వేసింది. ఆమె డ్యాన్స్ కి.. కుటుంబసభ్యులు, స్నేహితులు కూడా ఫుల్ సపోర్ట్ చేశారు. ఇటీవల.. వైఎస్డీసీ కొరియోగ్రఫీ వారు.. వీడియోని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా.. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది.  దాదాపు రెండు లక్షలకు పైగా వ్యూస్ రావడం విశేషం. ఆమె డ్యాన్స్ కి అందరూ ఫిదా అయిపోతున్నారు. దీంతో.. ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది. కావాలంటే.. ఆ డ్యాన్స్ వీడియో ని మీరు కూడా చూసేయండి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios