అమ్మాయిలకు హ్యాండ్ బ్యాగ్స్ కి విడదీయలేని అనుబంధం ఉంటుంది. ఒక అమ్మాయి ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టిందంటే చాలు.. చేతిలో చిన్న పర్స్ గానీ.. లేదా హ్యాండ్ బ్యాగ్ కానీ కచ్చితంగా ఉంటుంది. చాలా మంది అమ్మాయిలు అకేషన్ కి తగ్గట్టుగా కూడా వీటిని మారుస్తూ ఉంటారు. షాపింగ్ కి అయితే ఒకలాగా.. టూర్ కి వెళ్తే మరోటి..  ఆఫీస్ కి అయితే ఇంకోటి అంటూ రక రకాల బ్యాగ్స్ మారుస్తూ ఉంటారు.  ట్రెండ్ తగ్గట్టుగా మార్కెట్లోకి కూడా ఈ బ్యాగ్స్ వచ్చేస్తున్నాయి.

ట్రెండ్ కి తగట్టు ఈ హ్యాండ్ బ్యాగ్స్ మారుస్తూ ఉండటంలో తప్పులేదు. అయితే.... మీరు వాడే ఈ రకరకాల హ్యాండ్ బ్యాగ్స్ లో ఏం పెడుతున్నారు..? అమ్మాయిల హ్యాండ్ బ్యాగ్స్ లో కచ్చితంగా ఉంచుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం...

కాలానికి తగ్గట్టూ అమ్మాయిలు మారుతూ ఉండాలి. అది ఫ్యాషన్ విషయంలో మాత్రమే కాదు. ఎవరికి ఎప్పుడు ఎటు నుంచి ప్రమాదం వస్తుందో ఎవరూ ఊహించలేరు. ప్రమాదంలో ఉన్న సమయంలో ఎవరో వచ్చి కాపాడతారు అని ఎదురు చూడటం తపపని నిపుణులు  చెబుతున్నారు. అమ్మాయిలు తమ స్వీయ రక్షణ ఏర్పాట్లలో ఉండాలని చెబుతున్నారు. అందుకే కచ్చితంగా మీ హ్యాండ్ బ్యాగ్స్ లో పెప్పర్  స్ప్రేని వాడటం మరచిపోవద్దని చెబుతున్నారు.

ఇంటి తాళం, బైక్ తాళం వంటి వాటిని ఒక్కొసారి ఎక్కడో పెట్టి మర్చిపోతూ ఉంటాం. తర్వాత ఎక్కడ పెట్టామా అని వెతుక్కుంటూ ఉంటాం. అలాంటి సమస్య రాకుండా.. స్పేర్ కీలను హ్యాండ్ బ్యాగ్ లో ఉంచుకోవడం మంచిది.

బయటకు వెళ్లినప్పుడు అన్ని ప్రాంతాల్లో మనకు నచ్చిన ఫుడ్ దొరికే అవకాశం ఉండదు. కాబట్టి.. ముందు జాగ్రత్తగా ఓ పండు, డ్రై ఫ్రూట్స్ లేదా బిస్కట్స్ లాంటివి దగ్గర ఉంచుకోవడం మంచిది. అదేవిధంగా మౌత్ ఫ్రెషనర్స్ కూడా వెంట ఉంచుకోవడం ఉత్తమం.

చాలా మందికి పీరియడ్స్ సమస్య వేధిస్తూ ఉంటుంది. ఎప్పుడు వస్తాయో కూడా తెలీకుండా వస్తాయి. ఒక్కోసారి మనమే అవి వచ్చే సమయాన్ని మరిచిపోతుంటాం. కాబట్టి ఎందుకైనా మంచిది ఎప్పుడూ ఒక శానిటరీ న్యాపికిన్ క్యారీ చేయాలి.

ఆరోగ్యమే కాదు.. బ్యూటీకి సంబంధించినవి కూడా హ్యాండ్ బ్యాగ్ లో ఉంచుకోవాలి. శానిటైజర్, కొన్ని ఫేస్ వైప్స్ బ్యాగులో ఉంచుకోవాలి. వైప్స్ ఉంటే అవసరమైన సమయంలో ముఖం తుడుచుుకోవడానికి ఉపయోగపడతాయి.

ఒక జత ఇయర్ రింగ్స్, స్టిక్కర్స్, శానిటరీ నాప్కిన్స్ కూడా వెంట ఉంచుకోవడం ఉత్తమం. అంతేకాదు ఒక చిన్న దువ్వెన, రబ్బర్ బ్యాండ్స్ కూడా వెంట ఉంచుకోవడం మంచిది. 

ఇవన్నీ ఈ హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుంటున్నారా? లేదా ఇంకెందుకు ఆలస్యం.. మీ బ్యాగ్ లో వీటికి కూడా కాస్త చోటు ఇవ్వండి.