ప్రస్తుత కాలంలో ఎవరి ఇంట్లోకి అయినా పాము దూరిందనుకోండి.. వెంటనే స్నేక్ క్యాచర్స్ ని పిలస్తున్నారు. వారు వచ్చి.. పాముకి ఎలాంటి హానీ కలగకుండా.. చాలా జాగ్రత్తగా ఆ పామును పట్టుకొని అనంతరం దానిని అడవిలో వదిలపెడుతున్నారు. తాజాగా.. ఓ మహిళా స్నేక్ క్యాచర్  ఇప్పుడు ఇంటర్నెట్ సంచలనంగా మారింది. 

దాదాపు ఈ స్నేక్ క్యాచర్ వృత్తిలో మహిళలు ఉండటం అరుదు. అందులోనూ ఈ మహిళ.. సాంప్రదాయ బద్ధంగా చీర కట్టుకొని వచ్చి మరీ పామును పట్టుకోవడం విశేషం. అంతేకాకుండా ఆమ దగ్గర పాముని పట్టుకోవడానికి పెద్దగా ఆయుధాలు లాంటివి కూడా ఏమీ లేవు. సింపుల్ వచ్చి పట్టేసుకుంటోంది. అలా ఆమె ఓ పాముని పడుతుండగా తీసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

సదరు మహిళ పేరు నీర్జర చిట్టి. ఈమె కర్ణాటక రాష్ట్రానికి చెందిన మహిళ. కాగా.. ఈమె.. కేవలం వట్టి చేతులతో వచ్చి చాకచక్యంగా పాముని పట్టేసుకుంటుంది. గతేడాది ఆమె ఓ కోబ్రా స్నేక్ ని పట్టుకోగా.. దానిని ఎవరో వీడియో తీశారు. కాగా.. ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ వీడియో నిడివి రెండు నిమిషాలు ఉంది. కాగా.. అందులో ఆమె చీర కట్టుకొని కనపడుతోంది. 

ఆమె ఏదో ఫంక్షన్ కోసం రెడీ అయ్యిందంట.. ఇలా పాముని పట్టుకోవాలి అనగానే.. అదే చీరలో వచ్చేసింది.  కాగా.. తొలుత ఆ స్నేక్ క్యాచర్ పేరు విరాట్ భాగిని అంటూ ఎవరో ట్విట్టర్ లో రాశారు. అయితే.. తర్వాత ఆమె పేరు  నీర్జర చిట్టి గా తెలిసింది.  మొత్తానికి వీడియో మాత్రం తెగ వైరల్ అవుతోంది.