‘‘చిట్టి నడుమునే చూస్తున్నా... ’’ అంటూ హీరో... హీరోయిన్ నడుము మీద పాట పాడేసుకుంటాడు. ఇదొక్కటే.. కాదు.. నడుము మీద చాలా పాటలే ఉన్నాయి. అన్నింట్లో.. నడుముని సన్నజాజితోనే పోలుస్తారు.. ఎందుకంటే అందమైన నడుము.. సన్నగానే ఉంటుంది అనేది అందరి అభిప్రాయం. అదే నిజం కూడా. నడుముకి రెండు పక్కలా కొవ్వు పేరుకుపోయి.. లావుగా ఉంటే.. చూసేవాళ్లకే కాదు.. మనకి కూడా ఇబ్బందిగానే ఉంటుంది.

ఏ డ్రస్ వేసుకున్నా.. చీర కట్టుకున్నా... లావుగా కనపడతూ ఉంటారు. మరీ ముఖ్యంగా పెళ్లై... పిల్లలు పుట్టిన వారిలో ఈ సమస్య ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. సాధారణంగా ప్రసవం తదనంతరం నడుము, పిరుదుల్లో కొవ్వు పేరుకుంటూ ఉంటుంది. 

జంక్ ఫుడ్ ఎక్కువగా తినేవాళ్లు.. చల్లని కూల్ డ్రింక్స్ తాగేవారికి కూడా ఈ సమస్య ఎదురౌతుంది. మరి దానికి  పరిష్కారమే లేదా అంటే.... చీరలు కట్టినప్పుడు ఎబ్బెట్టుగా కనిపించే ఈ కొవ్వును కరిగించడం కోసం తేలికపాటి వ్యాయామాలు క్రమం తప్పక చేయాలంటున్నారు నిపుణులు. అవేమిటంటే....
 
మోచేతులు, మోకాళ్ల మీద కూర్చుని, మడిచిన కుడి కాలును వెనక్కి పైకి లేపాలి. ఇదే తరహాలో ఎడమ కాలునూ లేపి దించాలి. ఇలా ఒక్కో కాలుతో 20 రెప్స్‌, 3 సెట్లు చేయాలి.
నిటారుగా నిలబడి ఒక కాలును వంచకుండా వీలైనంత వెనక్కి చాచాలి. ఇలాగే రెండో కాలితోనూ చేయాలి. ఒక్కో కాలితో 20 రిపిటీషన్స్‌, 3 సెట్లు చేయాలి. ఇలా చేయడం వల్ల కొవ్వు కరుగుతుంది.

అంతేకాకుండా.. కొన్ని రకాల ఫుడ్స్ కూడా తీసుకోవాలి. అల్లం టీ: అల్లం టీ తాగడం వల్ల శరీర బరువు తగ్గుతుంది. అల్లం శరీర ఉష్ణోగ్రతను పెంచి కొవ్వును కరిగిస్తుంది. రోజూ అల్లం టీ తాగితే పొట్టచుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. హెర్బల్ టీలు తాగడం వల్ల కూడా శరీర బరువును తగ్గించుకుని నాజూకుగా మారవచ్చు.

బాదం పప్పులు: రోజూ బాదం పప్పులు తింటే పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వును కరిగించడమే కాదు శరీర బరువును తగ్గిస్తాయి. బాదంలోని ఒమేగా-3 ప్యాటీ యాసిడ్స్ శరీరంలో పేరుకున్న ఫ్యాట్‌ని కరిస్తాయి. అందుకే రోజూ రాత్రి పడుకోబోయే ముందు ఆరేడు బాదం పప్పులు నీళ్లలో నానబెట్టి ఉదయం ఆ పప్పుపై వున్న పొట్టు తీసి తినాలి.

పుదీనా: ఇది కూడా పొట్ట చుట్టూ వున్న కొవ్వును కరిగించడంలో ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది. పొట్టలోని గ్యాస్ సమస్యను తగ్గిస్తుంది. ఇందులోని యాంటాక్సిడెంట్లు జీవక్రియ సరిగా జరిగేట్లు సహాయపడతాయి. కొవ్వును కరిగిస్తాయి. పుదీనా, కొత్తిమీర ఆకులను కలిపి బాగా సూరి అందులో నిమ్మరసం వేసి పేస్టులా తయారుచేయాలి. ఆ పేస్టులో చిటికెడు ఉప్పు వేయాలి. రోటి, ఇడ్లీల్లో ఈ చట్నీ వేసుకుని తింటే జీర్ణశక్తికి ఎంతో మంచిది.