ఈతరం అమ్మాయిలు కాసేపు చీర కట్టుకొని పెళ్లిలోనే.. ఫంక్షన్ లోనో నాలుగు అడుగులు వేయటానికి కూడా తెగ ఇబ్బంది పడుతుంటారు. అడుగు తీసి అడుగు వేయడానికి కూడా.. అమ్మో.. చీర కదా జాగ్రత్తగా నడవాలి అనేస్తుంటారు. ఏ పని చెప్పినా.. చీర కంఫర్ట్ లేదు.. నేను చేయలేను బాబోయ్ అని తప్పించుకుంటారు. అలాంటిది.. ఈ తరం అమ్మాయే.. నిండా పాతికేళ్లు కూడా ఉండవ్.. చీర కట్టుకొని.. స్పోర్ట్స్ షూ వేసుకొని హూప్ డ్యాన్స్ అదరగొట్టింది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది.

ఈ వీడియోలో కనిపించే అమ్మాయి పేరు ఈషా కుట్టీ. చక్కగా చీర కట్టుకొని నడముకి రింగు తగిలించుకోని.. హ్యూప్ డ్యాన్స్ అదరగొట్టేసింది. ఎంత వయ్యారంగా నడుము తిప్పుతూ డ్యాన్స్ వేసిందంటే.. చూసినవాళ్లంతా వావ్ అనకుండా ఉండేలకపోతున్నారు. ఆమె తన వీడియోని అలా సోషల్ మీడియాలో షేర్ చేసిందో లేదో.. అలా వైరల్ అయిపోయింది.

ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ గా మారింది. ‘జెండా పూల్’ అనే పాటకు ఆమె డ్యాన్స్ వేసింది. కాగా.. ఈ ఈషా కుట్టి.. ఓ ప్రముఖ జర్నలిస్ట్ చిత్ర నారాయణణ్ కుమార్తె కావడం గమనార్హం. తమ కుమార్తెకు వచ్చిన ప్రశంసలు చూసి ఆమె మురిసిపోయింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. ఈ వీడియోకి లక్షల్లో లైకులు, కామెంట్స్ రావడం విశేషం. ప్రతి ఒక్కరూ విపరీతంగా షేర్ చేసేస్తున్నారు. ఆమె డ్యాన్స్ మీకు కూడా చూడాలని ఉందా.. ఇంకెందుకు ఆలస్యంగా ఈకింద వీడియోలో చూసేయండి. ఈ వీడియోకి #sareeflow అని ట్యాగ్ చేయగా.. ఈ ట్యాగ్ కూడా ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. ఈ అమ్మాయి వయసు 23ఏళ్లు కావడం గమనార్హం.