అశ్లీలంపై మహిళల చూపు.. హెచ్చరిస్తున్న పోలీసులు

ఈ అశ్లీల వీడియోల కారణంగా మహిళలు, యువతులు, చిన్నారులపై దాడులు జరుగుతున్నాయని ఆయన చెబుతున్నారు. మహిళలకు, పిల్లలకు భద్రత కల్పించే రీతిలో దూకుడు పెంచి ఉన్న పోలీసుల యంత్రాంగం అశ్లీల వీడియోలను అదే పనిగా గంటల కొద్ది వీక్షించే వారి భరతం పట్టే రీతిలో చర్యలు చేపట్టారు. 
 

Pornography offenders arrest list revealed by DGP Ravi

పోర్న్ చిత్రాలను ఎక్కువగా పురుషులే చూస్తుంటారని అందరూ అనుకుంటారు. అయితే... వారికంటే ఎక్కువగా స్త్రీలు చూస్తున్నారని తాజా సర్వేలో తేలింది. ఇతర దేశాలతో పోలిస్తే... భారతీయులే ఎక్కువగా ఇలాంటి వీడియోలను, వెబ్ సైట్లను ఫాలో అవుతున్నారని ఆ సర్వేలో తేలింది. అయితే... ఇప్పుడు అలా చూసేవారిలో మహిళల శాతం ఎక్కువగా ఉందని తేలింది.

కాగా... కేవలం చెన్నైలో ఈ  అశ్లీల వీడియోలను చూస్తున్న దాదాపు 30మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అదేపనిగా ఆ వీడియోలను వీక్షించడం ఆతర్వాత వాటి ప్రభావంతో నేరాలకు పాల్పడుతున్నారని తమిళనాడు ఏ డీజీపీ రవి పేర్కొన్నారు. ఆయన ఈ అంశంపై పిల్లలు, మహిళలకు అవగాహన కల్పించారు.

ఈ అశ్లీల వీడియోల కారణంగా మహిళలు, యువతులు, చిన్నారులపై దాడులు జరుగుతున్నాయని ఆయన చెబుతున్నారు. మహిళలకు, పిల్లలకు భద్రత కల్పించే రీతిలో దూకుడు పెంచి ఉన్న పోలీసుల యంత్రాంగం అశ్లీల వీడియోలను అదే పనిగా గంటల కొద్ది వీక్షించే వారి భరతం పట్టే రీతిలో చర్యలు చేపట్టారు. 

చిన్న పిల్లల్ని, మైనర్లను అశ్లీలంగా చిత్రీకరించి తీసిన వీడియోలే కాదు. అశ్లీల సైట్స్‌ల్లో గంటల కొద్ది గడిపే వారిని గురి పెట్టి భరతం పట్టే విధంగా పోలీసులు దూకుడు పెంచే పనిలో పడ్డారు. తమిళనాడు రాష్ట్రంలో మూడు వేల మంది అదే పనిగా పోర్న్‌ వీడియోల్ని వీక్షిస్తూ, గంటల కొద్ది ఆన్‌లైన్‌లో గడుపుతున్నట్టుగా తేలింది. ఇందులో మహిళలు కూడా ఉన్నట్టు ప్రస్తుతం సంకేతాలు వెలువడ్డాయి. వీరు చెన్నైలో ఉండడం గమనార్హం. ఈ విషయాన్ని స్వయంగా ఏడీజీపీ రవి వివరించారు. పోర్నగ్రఫీకి పాల్పడేవారికి అరెస్టు చేస్తున్నట్లు కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios