వోగ్ ఇండియా ఉమెన్ ఆఫ్ ది ఇయర్... నిధీ సునీల్..!
వోగ్ఇండియా నవంబర్ కవర్ 2021లో వివిధ రంగాల్లో మహిళలు సాధించిన విశేషమైన విజయాలను గుర్తించి..వారి ఫోటోలను వోగ్ ఇండియా ప్రచురించింది. వారిలో నిధి సునీల్ కూడా ఒకరు కావడం గమనార్హం.
మాజీ అందాల రాణి, మోడల్, కార్యకర్త, రంగు విషయంలో విమర్శలు ఎదుర్కొన్న నిధి సునీల్.. సత్తా చాటారు. వోగ్ ఇండియా ఉమెన్ ఆఫ్ ది ఇయర్ గా నిధి సునీల్ నిలిచారు. ఫ్యాషన్ రంగంలో తన సత్తా చాటుతూ.. రంగు వివక్షను ఎదుర్కొంటూ.. నిధి సునీల్ సత్తా చాటారు.
వోగ్ఇండియా నవంబర్ కవర్ 2021లో వివిధ రంగాల్లో మహిళలు సాధించిన విశేషమైన విజయాలను గుర్తించి..వారి ఫోటోలను వోగ్ ఇండియా ప్రచురించింది. వారిలో నిధి సునీల్ కూడా ఒకరు కావడం గమనార్హం.
నిధి.. ఫ్యాషన్ రంగంలో గతంలో ఉన్న మూస పద్దతులను తుడిచేశారు. L'Oréal Paris గ్లోబల్ అంబాసిడర్‌గా మారిన మొదటి భారతీయ మోడల్‌గా గుర్తింపు పొందారు. ఆమె ఇటీవలే పారిస్ ఫ్యాషన్ వీక్‌లో L'Oréal Paris ఫ్యాషన్ షో సందర్భంగా ఈఫిల్ టవర్ ముందు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రఖ్యాత శక్తివంతమైన మహిళలతో కలిసి ర్యాంప్ వాక్ చేశారు.
ఒకప్పుడు తన రంగు గురించి తక్కువగా చేసిన వారే.. ఇప్పుడు ఆమెను గుర్తించి.. ప్రశంసలు కురిపించడం గమనార్హం. కాగా.. ఈ గొప్పతనాన్ని అందుకోవడం పట్ల నిధి సునీల్ సంతోషం వ్యక్తం చేశారు.
ఈ ఫ్యాషన్ పరిశ్రమలో.. నిలదొక్కుకోవడానికి.. తమ స్థానాన్ని విస్తరించడానికి చాలా కష్టపడాలని ఆమె చెప్పారు. తమ వ్యక్తిగత బ్రాండ్ ను సృష్టించడానికి చాలా కష్టపడినట్లు ఆమె చెప్పారు.
తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో గర్వంగా తన కథనాన్ని పంచుకుంటూ, “నేను మోడలింగ్‌లో కొన్ని చీకటి క్షణాలను కలిగి ఉన్నాను, కానీ ఇది వాటిలో ఒకటి కాదు. ఇది భారతదేశంలోని బ్రౌన్ అమ్మాయిలందరికీ, టేబుల్ వద్ద చోటు ఉన్నట్లు అనిపించలేదు. నేను గెలవను; మీరు."
ఇన్విజిబుల్ గర్ల్ ప్రాజెక్ట్ (లింగ హత్యలు , శిశుహత్యలతో పోరాడే సంస్థ) ప్రతినిధిగా కూడా ఉన్న నిధి, ఫ్యాషన్ పరిశ్రమలో మార్పును ప్రభావితం చేయడానికి తన ప్రజాదరణను , వేదికను ఉపయోగించుకుంది.