ఇది తలా.. పేల ఫ్యాక్టరీనా...?

ఓ యువతి తలలో.. కుప్పలు తెప్పలుగా పేలు పడ్డాయి. అది ఎంతలా అంటే... ఆ తలలో ఒక్కసారి దువ్వితే వచ్చిన పేలను చూస్తేనే కడుపులో తిప్పేసేలా ఉంది. 

Nauseating moment mother runs a comb through a young girl's hair and discovers an insane lice infestation

తలలో పేలు ఉండి.. ఇబ్బందిపడిన సందర్భం చాలా మందికి ఎదురయ్యే ఉంటుంది. అయితే...  తలలో ఒకటో, రెండో పేలు ఉంటేనే అవి పెట్టే చిరాకుకి కనీసం నిద్ర కూడా పట్టదు. అలాంటిది ఓ యువతి తలలో.. కుప్పలు తెప్పలుగా పేలు పడ్డాయి. అది ఎంతలా అంటే... ఆ తలలో ఒక్కసారి దువ్వితే వచ్చిన పేలను చూస్తేనే కడుపులో తిప్పేసేలా ఉంది. ఈ సంఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకోగా... దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

ఆస్ట్రేలియాలోని కమిలోకు చెందిన ప్రముఖ హేయిర్‌ లైస్‌ రిమూవలిస్ట్‌ షెర్రీ రిచర్డ్‌సన్‌ ‘‘ నిట్‌ పైకర్స్‌ హెడ్‌ లైస్‌ రిమూవల్‌’’ పేరిట ఓ సెలూన్‌ నిర్వహిస్తోంది. కొద్దిరోజుల క్రితం విపరీతంగా పేలతో బాధపడుతున్న ఓ యువతి ఆమె వద్దకు వచ్చింది. ఈ నేపథ్యంలో దువ్వెనతో యువతి తలను దువ్విచూడగా ఒళ్లు గగుర్పొడిచే విధంగా ఆమె తల్లో నుంచి పేలు బయటపడ్డాయి.

దీన్ని వీడియో తీసిన షెర్రీ తన టిక్‌టాక్ ఖాతా‌లో దాన్ని షేర్‌ చేసింది. దీంతో వీడియో కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఐదు మిలియన్ల వీక్షణలు సొంతం చేసుకుంది. 75 వేలకుపైగా ప్రతిస్పందనలు వచ్చాయి. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘బాబోయ్‌!  తల్లో పేల ఫ్యాక్టరీ ఉందా ఏంటి?’’.. ప్రేమలో పడినోళ్లు.. తల్లో పేలు ఉన్నోళ్లు సుఖపడినట్లు చరిత్రలో లేదు.’’ అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.

 

ఒకరైతే అన్ని పేలు నా తలలో ఉంటే.. నేను ఏకంగా గుండే చేయించుకుంటా అని కామెంట్ చేయగా.. అది తల కాదు.. జూ అని మరొకరు కామెంట్ చేశారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios