ఆయుర్వేద టిప్స్... చేయాల్సినవీ చేయకూడనివీ ఇవేనంటున్న మీరా కపూర్..!
ఆయుర్వేదం అనేది స్వీయ రక్షణ. ప్రకృతి నుంచి వచ్చే వనరుల సహాయంతో జీవించడం. ఆయుర్వేదం అంటే కేవలం ఉసిరి, వేప, అశ్వగంథ మాత్రమే కాదు. ప్రకృతి బద్దంగా లభించే ప్రతిదీ ఆయుర్వేదమే.
ఇప్పుడంటే.. మనకు అన్నీ మార్కెట్లో క్రీములు, మందుల రూపంలో లభిస్తున్నాయి కానీ.. ఒకప్పుడు అందరూ కేవలం ఆయుర్వేదాన్ని మాత్రమే ఉపయోగించేవారు. వాటిలో ఎలాంటి కెమికల్స్ లేకపోవడంతో పాటు.. మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కల్పిస్తాయి. అయితే.. ఆయుర్వేదాన్ని ఉపయోగించే క్రమంలోనూ పొరపాట్లు చేయకూడదట. ఆయుర్వేద లైఫ్ స్టైల్ ఫాలో అయ్యే క్రమంలో చేయాల్సినవీ, చేయకూడనివీ కొన్ని ఉంటాయట. వాటిని ప్రముఖ బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ భార్య మీరా కపూర్ వివరించారు. మరి అవేంటో ఓసారి చూద్దాం..
ఆయుర్వేదం అనేది స్వీయ రక్షణ. ప్రకృతి నుంచి వచ్చే వనరుల సహాయంతో జీవించడం. ఆయుర్వేదం అంటే కేవలం ఉసిరి, వేప, అశ్వగంథ మాత్రమే కాదు. ప్రకృతి బద్దంగా లభించే ప్రతిదీ ఆయుర్వేదమే.
ఆయుర్వేదం ప్రకారం.. ఉదయం తీసుకునే అల్పాహారం వెచ్చగా ఉండాలట. జీవక్రియను కిక్ స్టార్ట్ చేయడానికి కచ్చితంగా వెచ్చని ఆహారం తీసుకోవాలని మీరా కపూర్ తెలిపారు.
అంతేకాకుండా.. ఆయుర్వేదం ప్రకారం కాలానుగుణంగా మనం తీసుకునే ఆహారంలో మార్పులు తీసుకోవాలట. వీటినే సీజనల్ ఫుడ్స్ అని అంటారు.
ఆయుర్వేదం ప్రకారం, సంవత్సరాన్ని రెండు కాలాలుగా విభజించారు - ఉత్తరాయణం (ఉత్తర అయనాంతం), దక్షిణాయణం (దక్షిణ అయనాంతం), ప్రతి ఒక్కటి మూడు రుతువులుగా విభజిసస్తారు. మన శరీరం వాత (గాలి , అంతరిక్షం ద్వారా పాలించబడుతుంది), పిత(అగ్ని, నీటిచే పాలించబడుతుంది) కఫా (నీరు మరియు భూమిచే పాలించబడుతుంది) కలయిక అని నమ్ముతారు. ప్రతి సీజన్‌లు పైన పేర్కొన్న శక్తులను శాంతింపజేస్తాయి లేదా మండిస్తాయి. వాటిని బట్టి ఆహారం తీసుకోవాలని మీరా సూచించారు.
ఇక ఆయుర్వేదం ప్రకారం.. చేయకూడని పొరపాట్లు ఇవే..
ఆలస్యంగా నిద్రపోవడం..
ఆలస్యంగా నిద్రపోవడం అస్సలు చేయకూడదు. చాలా మంది ఏదో ఒక కారణం వల్ల.. అర్థరాత్రి వరకు నిద్రపోకుండా ఉండిపోతున్నారు. అలా చేయకూడదట. ప్రకృతికి అనుగుణంగా రోజూ ఒకే సమయానికి నిద్రపోవడం కూడా శరీరానికి అలవాటు చేయాలి. తొందరగా పడుకొని.. తొందరగా నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలి.
పచ్చిఆహారాలు..
ఎప్పుడూ ఉడకపెట్టిన ఆహారాలు మాత్రమే కాకుండా.. పచ్చి కూరగాయలు, పండ్లు తినడం కూడా అలవాటు చేసుకోవాలి. దీని వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
ఇక ఏవైనా రెండు ఆహారాలు కలిపి తీసుకునే టప్పుడు.. ఆ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఏది పడితే అది కలిపి తీసుకుంటే.. విషంలా మారి అనేక వ్యాధులు రావడానికి కారణమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి.. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.