Asianet News TeluguAsianet News Telugu

మిస్ యూనివర్స్ గా మెక్సికో అందం... ఎవరీ ఆండ్రియా..?

ప్రపంచంలోని అంద‌గ‌త్తెలంద‌రినీ వెన‌క్కునెట్టి, ఆండ్రియా ఈ కిరీటాన్ని ద‌క్కించుకోవడం విశేషం. మిస్ ఇండియా అడ్లైన్ కాస్టెలినో ఈ మిస్ యూనివర్స్ కిరీటానికి కొద్ది అడుగుల దూరంలో ఆగిపోయారు. 

Mexicos Andrea Meza Crowned Miss Universe 2021
Author
Hyderabad, First Published May 17, 2021, 1:12 PM IST

మిస్ యూనివర్స్ కిరిటాన్ని మెక్సికన్ బ్యూటీ మిస్ మెక్సికో ఆండ్రియా మెజా సొంతం చేసుకుంది. 73 మంది అందాల తారలు పోటీ పడగా ఆండ్రియా మెజా మిస్ యూనివర్స్ గా గెలుపొందింది. ఈ సంవత్సరం ఈ అందాల భామల పోటీ మయామి, ఫ్లోరిడాలోని సెమినోల్ హార్డ్ రాక్ హోటల్, క్యాసినో హాలీవుడ్‌లో నిర్వహించారు.

ప్రపంచంలోని అంద‌గ‌త్తెలంద‌రినీ వెన‌క్కునెట్టి, ఆండ్రియా ఈ కిరీటాన్ని ద‌క్కించుకోవడం విశేషం. మిస్ ఇండియా అడ్లైన్ కాస్టెలినో ఈ మిస్ యూనివర్స్ కిరీటానికి కొద్ది అడుగుల దూరంలో ఆగిపోయారు. దీంతో ఆమె అభిమానులు నిరాశకు గురయ్యారు. అయితే అడ్లైన్ కాస్టెలినో టాప్ ఫైవ్‌లో చోటు దక్కించుకున్నారు. మూడవ రన్నరప్‌గా అడ్లైన్ కాస్టెలినో నిలిచారు. 

 డిసెంబర్ 8, 2019న మిస్ యూనివర్స్ కిరీటం గెలుచుకున్న దక్షిణాఫ్రికాకు చెందిన తొలి నల్లజాతి మహిళగా జోజిబిని తుంజీ నిలిచింది. కరోనా మహమ్మారి కారణంగా తర్వాత మిస్ యూనివర్స్ పోటీలు వాయిదా పడాయి.

ఇక ఈ సంవత్సరం మిస్ మెక్సికో 69 వ మిస్ యూనివర్స్‌గా కిరీటం పొందింది. మిస్ మెక్సికో ఆండ్రియా మెజా ప్రపంచవ్యాప్తంగా 73 ఇతర అందమైన మహిళలతో పోటీపడి టైటిల్ గెలుచుకుంది. మిస్ ఇండియా, మిస్ బ్రెజిల్, మిస్ పెరూ మరియు మిస్ డొమినికన్ రిపబ్లిక్‌లతో పాటు ఆమె టాప్-5 లో చోటు దక్కించుకుంది.

అందంతోనే కాదు అద్భుతమైన సమాధానంతో హృదయాలను గెలుచుకుంది. వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఆండ్రియా లింగ హింసకు వ్యతిరేకంగా వాదించింది. తన విజయంతో, మిస్ యూనివర్స్‌గా పట్టాభిషేకం చేసిన మూడవ మెక్సికన్ మహిళగా ఆండ్రియా నిలిచింది.

కాగా మొత్తం డెబ్బై మందికి పైగా పాల్గొన్న ఈ పోటీలో విజయం సాధించారని ప్రకటించగానే ఆండ్రియా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కన్నీటి పర్యంతమవుతూనే క్యాట్‌వాక్‌ పూర్తి చేశారు.

మిస్‌ యూనివర్స్‌ వెబ్‌సైట్‌లో ఉన్న వివరాల ప్రకారం.. 26 ఏళ్ల ఆండ్రియా మెజా.. మెక్సికోని చిహువాకు చెందినవారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరింగ్‌లో పట్టా పుచ్చుకున్నారు. మోడలింగ్‌పై ఆసక్తి గల ఆమె.. చిహువా టూరిజం బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉంటూ తమ సంస్కృతీ సంప్రదాయాల గురించి ప్రపంచానికి చాటిచెబుతున్నారు.

అంతేగాకుండా, మహిళా హక్కులపై ఉద్యమిస్తూ.. లింగ వివక్షకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్నారు. ఇక సర్టిఫైడ్‌ మేకప్‌ ఆర్టిస్టు మోడల్‌ అయిన ఆండ్రియాకు క్రీడల అంటే కూడా ఆసక్తి. జంతు హింసను తట్టుకోలేని ఆమె.. వీగన్‌గా మారిపోయారు. పూర్తి శాకాహారమే తీసుకుంటున్నారు. కాగా మెక్సికో నుంచి మిస్‌ యూనివర్స్‌గా ఎంపికైన మూడో మహిళగా ఆండ్రియా నిలిచారు. అంతకు ముందు లుపితా జోన్స్‌(1991), షిమెనా నవరటె(2010) ఈ విశ్వ సుందరీమణులుగా నిలిచారు.

Follow Us:
Download App:
  • android
  • ios