వయసుతో సంబంధం లేకుండా.., మహిళలు అందరూ కచ్చితంగా చేయదగిన వ్యాయామాలేంటో వాటిని ఎలా చేయాలో.. నిపుణులు ఏమంటున్నారో  ఇప్పుడు చూద్దాం.. 

ప్రస్తుత కాలంలో మహిళలకు శారీరక వ్యాయామం చాలా తప్పనిసరి. అయితే.. ఎలాంటి వ్యాయామాలు చేయాలి అనే విషయంలో చాలా మందికి క్లారిటీ ఉండదు. వయసుతో సంబంధం లేకుండా.., మహిళలు అందరూ కచ్చితంగా చేయదగిన వ్యాయామాలేంటో వాటిని ఎలా చేయాలో.. నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం..


1.Walking lunges

ఈ వ్యాయామం మహిళలకు చాలా మంచి చేస్తుంది. ముందుగా నడుము దగ్గర చేతులు పెట్టాలి. ఆ తర్వాత ఫోటోలో చూపించిన విధంగా ముందుగా కుడి కాలితో.. పెద్ద అడుగు వేయాలి. ఆ తర్వాత.. మళ్లీ మరో కాలితో వేయాలి. ఇలా చేయడం వల్ల కాళ్ల కండరాలు మెరుగుపడతాయి.

2.Broad Jump:

మీ మోకాళ్లను.. నడుముతో సమానంగా ఉంచేలా కూర్చోవాలి. ఆ తర్వాత అదే పొజిషన్ లో ఉండి.. ఫోటోలో చూపించిన విధంగా ముందుకు వెనక్కి జంప్ చేయాలి. ఇలా కనీసం పది నుంచి 20 నిమిషాల పాటు చేయాలి.

3.Side PlanK..

ప్లాంక్ పొజిషన్ అందరికీ తెలిసే ఉంటుంది. చేతులు, పాదాల మీద.. మిగిలిన భాగం మొత్తాన్ని ఆపాలి. ఈ ప్లాంక్ ని.. మామూలుగా కాకుండా.. సైడ్ ప్లాంక్ చేయాలి. ఇలా చేయడం వల్ల కూడా.. కాలి కండరాలు బలపడతాయి. శరీరంలోని అదనపు కొవ్వును కరిగించడానికి సహాయం చేస్తుంది.

4.Banded Lateral Walk

మోకాలికి కొద్దిగా పై భాగంలో బ్యాండ్ వేసుకోవాలి. రెండు కాళ్ల మధ్య గ్యాప్ ఉంచాలి. తర్వాత మెకాళ్లను కొద్దిగా కిందకు వంచాలి. అలానే ఉంచి.. ముందుకు నడవడానికి ప్రయత్నించాలి. ఇది.. నడుము దగ్గర కొవ్వు కరిగించడానికి.. ఆరోగ్యంగా ఉండటానికి సహాయం చేస్తుంది.

5.Duck Walks
పాదాలను వెడల్పుగా ఉంచి నిలబడండి
నెమ్మదిగా సగం స్క్వాట్ పొజిషన్‌లో కూర్చోండి.
తుంటిని స్థిరంగా ఉంచడం, కుడి మోకాలిని క్రిందికి నేలకి ఉంచడం,
ఎడమ మోకాలికి ఇలా చేయండి.
కుడి పాదాన్ని ముందుకు తీసుకురండి, ఆ తర్వాత ఎడమవైపు
సగం స్క్వాట్ స్థానానికి తిరిగి వెళ్ళాలి.