Asianet News TeluguAsianet News Telugu

నవరాత్రి ఉత్సవాలు... ఈ తొమ్మిది రంగుల ప్రత్యేకత తెలుసా..?

ఒక్కో రంగులో అలంకరిస్తారు. అలా తొమ్మదిరోజుల్లో తొమ్మిది రంగుల్లో అలంకరిస్తారు. మరి ఆ తొమ్మిది రంగుల స్పెషాలిటీ ఏంటో తెలుసుకుందామా.

Know the importance of nine days, nine colours
Author
Hyderabad, First Published Oct 9, 2021, 1:14 PM IST

నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నవరాత్రి వేడుకల్లో భాగంగా బతుకమ్మ సంబరాలు కూడా మొదలుపెట్టేశారు. అయితే.. ఈ నవరాత్రి వేడుకల సమయంలో.. ప్రతి ఒక్కరూ కచ్చితంగా తొమ్మిది రంగుల గురించి తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే.. ఈ నవరాత్రి వేడుకల్లో భాగంగా.. ఒక్కో రోజు అమ్మవారికి ఒక్కో  అవతారంతో పాటు.. ఒక్కో రంగులో అలంకరిస్తారు. అలా తొమ్మదిరోజుల్లో తొమ్మిది రంగుల్లో అలంకరిస్తారు. మరి ఆ తొమ్మిది రంగుల స్పెషాలిటీ ఏంటో తెలుసుకుందామా..

day1: నవరాత్రి వేడుకల్లో మొదటి రోజు అమ్మవారికి పసుపు రంగు చీరలో దర్శనమిస్తారట. దీనిని ప్రతిపాద అంటారట. అందుకే.. మొదటి రోజు అమ్మవారి మొదటి అవతారానికి పసుపు రంగు చీరను కడతారట. మనం కూడా అదే రంగు దుస్తులను ధరిస్తే మంచి జరుగుతుంది.

day2:నవరాత్రి రెండో రోజును ద్వితీయ అని పిలుస్తారు. ఈ రోజున బ్రహ్మచారి అమ్మవారి అవతారంలో దర్శనమిస్తారు.  ఈ రోజున అమ్మవారిని ఆకుపచ్చ రంగులో అలంకరిస్తారు. మనం కూడా అదే రంగు దుస్తులను ధరిస్తే మంచి జరుగుతుంది.

day3:ఇక మూడో రోజుని త్రితియ అని కూడా పిలుస్తారు. ఈ రోజున గ్రే కలర్( బూడిద రంగు ) చీరలో అలంకరిస్తారు ఇది సూక్ష్మతకు ప్రతీకగా నిలుస్తుందట. మనం కూడా అదే రంగు దుస్తులను ధరిస్తే మంచి జరుగుతుంది.

day4:నవరాత్రి వేడుకల్లో నాలుగో రోజున ఆరెంజ్ రంగు చీరతో అలంకరిస్తారట. ఈ ఆరెంజ్ కలర్ వెచ్చదనానికీ, అత్యుత్సాహాం ప్రాముఖ్యతను తెలియజేస్తుందట.  మనం కూడా అదే రంగు దుస్తులను ధరిస్తే మంచి జరుగుతుంది.

day5:నవ రాత్రి వేడుకల్లో భాగంగా ఐదో రోజును  పంచమి అని కూడా పిలుస్తారు. ఈ రోజున తెలుపు రంగు చీరలో అమ్మవారు దర్శనమిస్తారు. ఆ రోజు మనం కూడా తెల్లని వస్త్రాలు ధరిస్తే.. ఆ అమ్మ ఆశీర్వాదం మనకు దక్కుతుందని నమ్మకం. తెలుపు అందం, స్వచ్ఛత మరియు అమాయకత్వానికి చిహ్నంగా చెప్పబడింది.

day6:ఎరుపు రంగు శక్తివంతమైనది, ధైర్యం. ఇది ఆరో రోజు ఈ రంగు దుస్తులు ధరించడం మంచిది. ఆరోగ్యం, జీవితం, అనంతమైన ధైర్యం, తీవ్రమైన అభిరుచి ఈ ఎరుపు రంగు సూచిస్తుంది. 

7 వ రోజు: రాయల్ బ్లూ
సప్తమి రోజున, రాజ నీలం ధరించాలని నిపుణులు సూచించారు. ఇది మంచి ఆరోగ్యం, శ్రేయస్సును సూచిస్తుంది; ఈ అందమైన రంగును ధరించి భక్తులు తప్పనిసరిగా నవరాత్రి ఉత్సవాలలో పాల్గొంటే. అమ్మవారి కృప వారికి లభిస్తుందట.

8 వ రోజు: పింక్
అష్టమి అత్యంత ప్రాముఖ్యత కలిగిన రోజుగా సూచిస్తారు. భక్తులు పింక్ కలర్ ధరించాలని సూచిస్తుంటారు. పింక్ సార్వత్రిక ప్రేమ, మృదుత్వం, స్త్రీ ఆకర్షణ , నిజాయితీని సూచిస్తుంది.

9 వ రోజు: పర్పుల్
తొమ్మిదవ రోజు నవరతి 2021 చివరి రోజు. అందువల్ల ఆ రోజును పర్పుల్ రంగుతో జరుపుకోవాలని సూచించారు. ఈ రంగు శక్తి, వైబ్రేషన్, జీవితం, విశ్రాంతి  సానుకూలత  మిశ్రమంగా చెబుతుంటారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios