Asianet News TeluguAsianet News Telugu

టిష్యూ చీరలో మెరిసిన కంగనా.. ధర ఎంతో తెలుసా?

కంగనా రనౌత్ అందమైన టిష్యూ చీర లుక్ ఫ్యాషన్ ప్రియులకు విపరీతంగా ఆకట్టుకోవడం విశఏషం  సుచా ఎక్రూ ఓల్డ్ బనారస్ ష్రింక్ టిష్యూ చీరను ధరించింది. 

Kangana Ivory Tissue  cost revealed stunning in viral ram
Author
First Published Aug 21, 2024, 4:49 PM IST | Last Updated Aug 21, 2024, 4:49 PM IST

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ గురించి పరిచయం అవసరం లేదు. కంగనాకి చీరలంటే ఇష్టం చాలా ఎక్కువ. ఎప్పటికప్పుడు చీరల్లో స్పెషల్ గా కనిపించేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. తాజాగా.. తన మూవీ ప్రమోషన్ కోసం చీరలో అందంగా మెరిసింది.  ఎమర్జెన్సీ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా.. ఆమె ఐవరీ కలర్ టిష్యూ శారీలో కనిపించింది. 

కంగనా రనౌత్ అందమైన టిష్యూ చీర లుక్ ఫ్యాషన్ ప్రియులకు విపరీతంగా ఆకట్టుకోవడం విశఏషం  సుచా ఎక్రూ ఓల్డ్ బనారస్ ష్రింక్ టిష్యూ చీరను ధరించింది. ఈ అందమైన కర్టెన్ గోల్డెన్ బార్డర్ సిల్క్  జర్దోజీ హ్యాండ్‌వర్క్‌తో  చీరను చాలా అందంగా డిజైన్ చేశారు. 

ఇక.. ఈ చీరకు మ్యాచింగ్ ఫుల్ స్లీవ్ బ్లౌజ్ ధరించింది. ఇది స్కూప్డ్ నెక్‌తో డిజైన్ చేశారు. బ్లౌజ్‌కు మోరీ , సీక్విన్ స్ప్రింక్లర్‌లతో భారీ అంచు కూడా ఉంది. . కంగనా రనౌత్ కూడా ఈ లుక్‌లో అందంగా కనిపించింది. ఈ చీర ధర కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. చీర చూడటానికి సింపుల్ గా ఉన్నా.. ధర మాత్రం ఎక్కువగా ఉందని తెలుస్తోంది. ఈ చీర ధర రూ.48,995. 

ఈ చీర మీరు కూడా కావాలి అనుకుంటే..  మత్స్య  లేబుల్   వెబ్‌సైట్‌ ద్వారా కొనుక్కోవచ్చు. ఇక.. ఈచీరకు ఆమె ధరించిన జ్యూవెలరీ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచిందని చెప్పొచ్చు. భారీ చోకర్ ధరించారు. దానికి జతగా డైమండ్ నెక్లెస్ కూడా జోడించారు. ఇక.. కంగనా ఇటీవలే.. రాజకీయ నాయకురాలిగా కూడా మారిన విషయం తెలిసిందే.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios