చలికాలంలో పెదాల పగుళ్ల సమస్య... ఇదో పరిష్కారం
పగుళ్లు ఏర్పడిన పెదవుల మీద కొద్దిగా కొబ్బరి నూనె రాస్తే వాటికి తేమ అందుతుంది. కొబ్బరినూనెలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పెదవుల పగుళ్ల మీద బ్యాక్టీరియా వృద్ధిని అడ్డుకుంటాయి. ఇన్‌ఫెక్షన్లను నివారిస్తాయి.
పెదాలు ఎర్రగా.. మృదువుగా ఉండాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. అందుకోసం వాళ్లు నిత్యం లిప్ బామ్స్ , లిప్ గ్లాస్ వంటివి వాడేస్తూ ఉంటారు. అయితే.. ఎంతవాడినా చలికాలం వచ్చిందటే చాలు పెదాల పగుళ్ల సమస్య మొదలైపోతుంది. అయితే... వీటికి కేవలం ఇంట్లో లభించే కొన్ని పదార్థాలతో చెక్ చెప్పేయచ్చని నిపుణులు చెబుతున్నారు.
పెదాల మీద మృతకణాలు పేరుకుపోవడం వల్ల పొడిబారినట్లు, తెల్లగా పొట్లు ఊడినట్లుగా కనిపిస్తాయి. అలాంటప్పుడు స్క్రబ్బర్ తో వాటిని ముందుగా తొలగించాలి. తేనె, పంచదార పెదాలకు మంచి స్క్రబ్బర్ గా పనిచేస్తుంది. ఈ రెండింటిని కలిపి పెదాలపై రుద్దితే మృదువుగా మారతాయి.
పగుళ్లు ఏర్పడిన పెదవుల మీద కొద్దిగా కొబ్బరి నూనె రాస్తే వాటికి తేమ అందుతుంది. కొబ్బరినూనెలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పెదవుల పగుళ్ల మీద బ్యాక్టీరియా వృద్ధిని అడ్డుకుంటాయి. ఇన్‌ఫెక్షన్లను నివారిస్తాయి.
Also Read శీతాకాలంలో టమాటతో అందం మీ సొంతం...
అలోవెరాలోని జెల్ పగిలిన పెదవులకు మందుగా పనిచేస్తుంది. అలోవెరా జెల్‌ను కొద్దిసేపు ఫ్రిజ్‌లో ఉంచి, పెదవులకు రాసుకోవాలి. రోజుకు రెండు లేదా మూడు సార్లు ఈ జెల్ రాసుకుంటే అధరాలు సున్నితంగా, ఆరోగ్యంగా మారతాయి.
పెదాలు ఎండిపోయినట్లుగా అనిపించినప్పుడు ఒక చుక్క నెయ్యి రుద్దుకుంటే పెదవులకు తేమ అందుతుంది. రాత్రిపూట నిద్రపోయే ముందు నెయ్యి రాసుకుంటే పెదవులు తాజాగా కనిపిస్తాయి.
గ్రీన్ టీ బ్యాగ్ టీలోని యాంటీ ఆక్సిడెంట్, మినరల్స్, పాలీఫెనాల్స్ పెదవులకు రక్షణనిస్తాయి. అందుకే గ్రీన్ టీ బ్యాగును పెదవుల మీద కొద్దిసేపు రుద్దుకుంటే మృతకణాలు మాయమవుతాయి.