జుట్టు రాలే సమస్యతో బాధపడేవారు చాలా మంది ఉన్నారు. కనీసం 30ఏళ్లు కూడా రాకముందే విపరీతంగా జుట్టు ఊడిపోతోందని చాలా మంది తెగ బాధపడుతుంటారు. అయితే.... కొన్ని రకాల చిట్కాలు ఫాలో అయ్యి.. కొన్ని రకాల ఫుడ్స్ తీసుకుంటే చాలు అని నిపుణులు సూచిస్తున్నారు.

 కొంచెం కొబ్బరినూనె తీసుకోండి. ఆ కొబ్బరి నూనెలో మందార పూలను వేయండి. రెండింటినీ బాగా మరగబెట్టండి. తర్వాత చల్లార్చండి. ఆ నూనెను ప్రతి రోజు తలకు పట్టించండి. ఇలా క్రమం తప్పకుండా కొన్ని రోజులు ఈ నూనెను వాడితే జుట్టు ఊడిపోవడం తగ్గుతుంది. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

దీనితోపాటు.. కొన్ని రకాల ఆహారాలు కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రోటీన్లు అధికంగా ఉండే చికెన్‌, చేప, గుడ్లు తప్పకుండా తీసుకోండి. అలాగే, మాంసాహారంతో పాటుగా పాలు, పెరుగు, పప్పు ధాన్యాలు, ఆకుకూరలు అవసరం. వీటిలో ఉన్న ఐరన్‌, జింక్‌, సెలీనియం మొదలైన ఖనిజాలు జుట్టు రాలకుండా ఉండడానికి, ఆరోగ్యంగా పెరగడానికి అత్యవసరం. 

అంతే కాకుండా బాదం, ఆక్రోట్‌, నువ్వులు, అవిసె గింజలు మొదలైన వాటిల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్లు సమస్య నివారణకు కొంత ఉపయోగపడతాయి. మీ జీవన విధానంలో ఆందోళనను తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తే మంచిది. రాత్రి కనీసం ఏడు నుండి ఎనిమిది గంటల నిద్ర ఎంతో అవసరం.