కరివేపాకును ఇలా పెడితే.. మీ జుట్టు ఒత్తుగా పెరుగుతుంది, నల్లగా ఉంటుంది
కరివేపాకులో ఎన్నో ఔషదగుణాలుంటాయి. దీన్ని తిన్నా.. ఇతర మార్గాల్లో తీసుకున్నా.. మన జుట్టు నల్లగా, ఒత్తుగా పెరుగుతుంది. జుట్టు పల్చగా ఉన్నవారు కరివేపాకును ఎలా పెడితే ఒత్తుగా పెరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ఈ రోజుల్లో జుట్టు సమస్యలు చాలా కామన్ అయిపోయాయి. చెడు ఆహారపు అలవాట్లు, మారుతున్న జీవనశైలి, కాలుష్యం వంటి ఎన్నో కారణాల వల్ల జుట్టు విపరీతంగా రాలుతుంది. దీనివల్ల జుట్టు పల్చగా కనిపిస్తుంది. అయితే కరివేపాకును ఒక విధంగా పెడితే మీ జుట్టు తిరిగి ఒత్తుగా మారుతుంది. కొత్త వెంట్రుకలు కూడా మొలుస్తాయి. అలాగే తెల్ల వెంట్రుకలు రావు. ఇందుకోసం కరివేపాకును ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
జుట్టుకు కరివేపాకు: కరివేపాకులో ఉండే ఔషదగుణాలు మన జుట్టుకు ఒక వరంలా పనిచేస్తాయి. అవును కరివేపాకును జుట్టుకు ఉపయోగించడం వల్ల ఎన్నో జుట్టు సమస్యలు తగ్గిపోతాయి.
కరివేపాకుతో స్ప్రే: జుట్టు సమస్యలను తగ్గించుకోవడానికి.. ముందుగా ఒక గ్లాసు నీళ్లను స్టవ్ పై పెట్టండి. దీంట్లో గుప్పెడు కరివేపాకులు వేసి మరిగించాలి. నీళ్లు రంగు మారిన వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి. ఈ వాటర్ ను చల్లారనివ్వండి. ఈ వాటర్ ను రాత్రి లేదా ఉదయాన్నే తలస్నానం చేసే ముందు జుట్టుకు అప్లై చేయండి. దీన్ని తలకు బాగా పట్టిస్తే మంచి ఫలితం ఉంటుంది.
జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది: కరివేపాకు నీటిని క్రమం తప్పకుండా జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు రాలే సమస్య చాలా వరకు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ వాటర్ మన నెత్తిని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.
కరివేపాకు, మెంతులు: ఒక టీస్పూన్ మెంతులను తీసుకుని వీటిని రాత్రంతా నీళ్లలో నానబెట్టండి. ఉదయాన్నే బాగా నానిన మెంతులను, కరివేపాకులను తీసుకుని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయండి. ఈ పేస్ట్ ను జుట్టుకు బాగా పెట్టండి.
జుట్టు మందంగా ఉంటుంది: ఈ కరివేపాకు పేస్టును క్రమం తప్పకుండా జుట్టుకు పెట్టడం వల్ల జుట్టుకు సంబంధించిన ఎన్నో సమస్యలు తగ్గిపోతాయి. ఇది జుట్టు రాలడాన్ని చాలా వరకు ఆపుతుంది. అలాగే కొత్త జుట్టు రావడానికి సాహాయపడుతుంది. ఇది జుట్టును ఒత్తుగా చేస్తుంది. మీకు తెలుసా? కరివేపాకు మన జుట్టుకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది మన జుట్టు నిర్జీవంగా మారకుండా చేస్తుంది. అలాగే వెంట్రుకలు త్వరగా పొడవుగా, దృఢంగా పెరిగేలా చేస్తుంది.