Asianet News TeluguAsianet News Telugu

అత్తగారి హోదాలో ఇన్ఫోసిస్ సుధామూర్తి.. కోడలిని ఎలా చూసుకుంటారో తెలుసా?

సూధామూర్తి కుమారుడు రోహన్ మూర్తి తొలుత లక్ష్మీ వేణు అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ప్రముఖ బిజినెస్ మెన్ కుమార్తె అయిన లక్ష్మీ వేణుతో  ఎక్కువ కాలం కలిసి ఉండలేకపోయాడు. రోహన్.. ఆమెతో ఐదు సంవత్సరాల క్రితమే విడాకులు తీసుకున్నాడు. 

How Infosys Owner Sudhamurthy Act as a Mother in law role
Author
Hyderabad, First Published Sep 14, 2020, 1:09 PM IST

ఇన్ఫోసిస్ సుధామూర్తి.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఆడపిల్లకు చదువు ఎందుకు అనే పరిస్థితుల్లోనే ఆమె ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఆమె కంప్యూటర్ సైన్స్ లో  ఇంజినీరింగ్ విద్య పూర్తి చేశారు. కాగా.. ఆమె చదువుకునే సమయంలో.. ఆ కాలేజీ మొత్తంలో ఒకే ఒక అమ్మాయి ఆమె కావడం గమనార్హం. మిగిలినవారంతా అబ్బాయిలే. కనీసం తల పైకి ఎత్తడం కూడా నేరమే. అలా పరిస్థితుల్లోనూ ఆమె కాలేజీ టాపర్ గా నిలిచారు. ఇక ఆమె భర్త ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గురించి కూడా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

సుధామూర్తి మంచితనం.. ఆమె మనస్తత్వం గురించి అందరికీ తెలిసిందే. ఆమె చాలా సున్నిత మనస్కురాలు. ఎవరైనా ఆపదలో ఉన్నారంటే చాలు ఆమె వెంటనే సహాయం చేస్తారు. అలాంటి మనస్తత్వం ఉన్న సుధామూర్తి తన కోడలి విషయంలో ఎలా ఉంటారు అనే విషయం అందరికీ ఆసక్తి కలిగించే విషయమే.

కాగా..  సూధామూర్తి కుమారుడు రోహన్ మూర్తి తొలుత లక్ష్మీ వేణు అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ప్రముఖ బిజినెస్ మెన్ కుమార్తె అయిన లక్ష్మీ వేణుతో  ఎక్కువ కాలం కలిసి ఉండలేకపోయాడు. రోహన్.. ఆమెతో ఐదు సంవత్సరాల క్రితమే విడాకులు తీసుకున్నాడు. కాగా.. గతేడాది రోహన్.. అపర్ణ క్రిష్ణన్ అనే యువతిని రెండో వివాహం చేసుకున్నాడు.

వీళ్లు ఎంతో సంపన్నులైనప్పటికీ.. చాలా సింపుల్ గా పెళ్లి జరిపించారు. కాగా.. కోడలి విషయంలో ఆమె తల్లి కన్నా ఎక్కువగా చూసుకనేవారంట. మీ అత్తగారి గురించి ఒక్క మాటలో చెప్పమంటే ఏం చెబుతారు అని  అపర్ణని ఎవరైనా అడిగితే.. ఆమె తనకు రోల్ మోడల్ అని చెప్పేస్తుందట. తనకే కాదు.. చాలా మంది మహిళలకు, అత్తలకు ఆమె రోల్ మోడల్ అని సమాధానం చెప్పేసింది.

How Infosys Owner Sudhamurthy Act as a Mother in law role

కాగా.. ఇదేమాట సుధామూర్తిని అడిగితే.. తన ప్రకారం ఏ అత్త చెడ్డవారు కాదని ఆమె పేర్కొంది. ప్రతి ఒక్క మహిళ పుట్టిన దగ్గర నుంచి పెరిగి పెద్దయ్యే వరకు చాలా కష్టాలు చూసి ఉంటారని.. పరిస్థితిని బట్టి కందరు కఠినంగా ప్రవర్తిస్తుంటారని.. అలా అని వారంతా చెడ్డవారు కాదని ఆమె పేర్కొనడం గమనార్హం. 

మనం మంచిగా ఉంటే.. వాళ్లు కూడా ప్రేమగానే ఉంటారని సుధామూర్తి పేర్కొన్నారు. తాను తన కోడలిపై ఎలాంటి టెన్షన్స్ పెట్టనని.. వాళ్లు ఆనందంగా ఉండటమే తనకు ముఖ్యమని ఆమె చెప్పడం గమనార్హం. 

Follow Us:
Download App:
  • android
  • ios