Asianet News TeluguAsianet News Telugu

తెలుగు రాష్ట్రాల్లో అత్యంత మహిళా ధనవంతురాలు ఈమే...!

తెలుగు రాష్ట్రాలకు చెందిన శ్రీమంతుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉండటం విశేషం. కాగా.. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఈ శ్రీమంతుల్లో 81 శాతం మంది హైదరాబాద్‌లో ఉండేందుకే ఇష్టపడుతున్నారని హురున్‌ ఇండియా వెల్లడించింది.

Biological managing Director mahima Datla Is the Richest woman in Telugu states
Author
Hyderabad, First Published Oct 7, 2021, 2:19 PM IST

మన తెలుగు రాష్ట్రాల్లో అత్యంత మహిళా సంపన్నురాలు ఎవరో మీకు తెలుసా..? ఇదిగో పైన ఫోటోలో  కనిపిస్తోందే ఆమే. పేరు మహిమ దాట్ల.  బయో ఫార్మా మేజర్ బయోలాజికల్‌-ఇ ప్రమోటర్, మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న మహిమ.. అత్యంత మహిళా సంపన్నురాలిగా నిలిచారు. మన తెలుగు రాష్ట్రాల్లో అంత్యంత సంపన్నురాల్లుగా ఇద్దరు మహిళలు నిలవగా.. అందులో మహిమ మొదటి స్థానంలో ఉన్నారు.

అంతకు మించిన వ్యక్తిగత సంపద కలిగి శ్రీమంతుల జాబితాలోకి చేరే వారి సంఖ్య కూడా ఆకర్షణీయంగా ఉంది. ‘ఐఐఎ్‌ఫఎల్‌ వెల్త్‌ హురున్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌ 2021’లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణకు చెందిన 69 మంది కుబేరులకు స్థానం లభించగా.. వీరి మొత్తం సంపద రూ.3,79,200 కోట్లకు చేరింది. ఏడాది క్రితంతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల శ్రీమంతుల వ్యక్తిగత సంపద 54 శాతం పెరిగిందని ఐఐఎ్‌ఫఎల్‌ వెల్త్‌  హురున్‌ జాబితా వెల్లడించింది. ఏపీ, తెలంగాణ శ్రీమంతుల్లో  బిలియనీర్లు (దాదాపు రూ.7,500 కోట్ల సంపద) కూడా గత ఏడాదితో పోలిస్తే 9 మంది నుంచి 15 మందికి పెరిగారు.

తెలుగు రాష్ట్రాలకు చెందిన శ్రీమంతుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉండటం విశేషం. కాగా.. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఈ శ్రీమంతుల్లో 81 శాతం మంది హైదరాబాద్‌లో ఉండేందుకే ఇష్టపడుతున్నారని హురున్‌ ఇండియా వెల్లడించింది. రూ.7,700 కోట్లతో  చెందిన మహిమ దాట్ల (బయోలాజికల్‌-ఇ) ఆమె కుటుంబం అగ్ర స్థానంలో ఉంది. మొత్తం భారతదేశంలోని సంపన్నుల జాబితాలో మహిమ 231వ ర్యాంకు సాధించారు.

తర్వాతి స్థానంలో.. ఎన్ఏసీఎల్ ఇండస్ట్రీస్ కి చెందిన కె. లక్ష్మీ రాజు రూ.వెయ్యి కోట్లతో తర్వాతి స్థానం దక్కించుకున్నారు.  భారతదేశంలోని సంపన్నుల జాబితాలో లక్ష్మీ రాజు 956వ ర్యాంకు సాధించారు. 


తెలుగు రాష్ట్రాల నుంచి టాప్ 10 ధనవంతులు..
పేరు    వెల్త్‌‌‌‌ (రూ. కోట్లలో)    కంపెనీ
దివి మురళి& ఫ్యామిలీ    79,000    దివీస్‌‌‌‌ ల్యాబొరేటరీస్‌‌‌‌
బీ పార్థసారధి రెడ్డి  & ఫ్యామిలీ    26,100    హెటెరో ల్యాబ్స్‌‌‌‌
పీపీ రెడ్డి, పీవీ కృష్ణా రెడ్డి & ఫ్యామిలీ    23,400    మేఘా ఇంజినీరింగ్‌‌‌‌& ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌
కే సతీష్‌‌‌‌ రెడ్డి & ఫ్యామిలీ    12,300    డా. రెడ్డీస్‌‌‌‌ ల్యాబొరేటరీస్‌‌‌‌
జీ అమరేందర్‌‌‌‌‌‌‌‌ రెడ్డి& ఫ్యామిలీ    12,000    జీఏఆర్‌‌‌‌‌‌‌‌
ఎం సత్యనారాయణ రెడ్డి& ఫ్యామిలీ    11,500    ఎంఎస్‌‌‌‌ఎన్‌‌‌‌ ల్యాబొరేటరీస్‌‌‌‌
జీవీ ప్రసాద్‌‌‌‌& ఫ్యామిలీ    10,300     డా.రెడ్డీస్ ల్యాబొరేటరీస్‌‌‌‌
వెంకటేశ్వర్లు జాస్తి& ఫ్యామిలీ    9,700    సువెన్ ఫార్మా
పీవీఎన్ రాజు    9,300    గ్లాండ్ ఫార్మా
వీసీ నన్నపనేని    9,100    నాట్కో ఫార్మా  

Follow Us:
Download App:
  • android
  • ios