అదిరిపోయే బనానా ప్యాక్స్... ముఖం మెరిసిపోవాల్సిందే..
కప్పులో సగం అరటి పండును తీసుకుని అందులోకి తేనె, నిమ్మరసాన్ని టేబుల్ స్పూన్ చొప్పున కలపాలి. తర్వాత బాగా మిక్స్ చేసి ముఖానికి పట్టిస్తే చర్మం మెరిసిపోతుంది.
మెరిసే చర్మం కోసం బ్యూటీపార్లర్ల చుట్టూ తిరగాల్సిన పని లేదు. ఖరీదైన బ్యూటీ సామగ్రి కొనాల్సిన అవసరం లేదు. అరటిపండు చాలు మీ చర్మం నిగారింపు సంతరించుకోవడానికి. ఎలా అంటారా? బనానాతో చేసే ఫేస్‌ప్యాక్‌లతో ఇది సాధ్యమే.
డ్రై స్కిన్ : అరటిపండును గుజ్జుగా చేసి దానికి కొంచెం తేనెను చేర్చి ముఖానికి, మెడ భాగానికి ప్యాక్ మాదిరిగా పట్టించాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం నిగారింపు సంతరించుకుంటుంది.
ముఖారవిందానికి : అరటిపండును గుజ్జుగా చేసి రెండు టీస్పూన్ల నిమ్మరసంను కలిపి ముఖానికి పట్టించాలి. ఇరవై నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా వారంలో రెండు రోజులు చేస్తే చర్మం మెరిసిపోతుంది.
న్యాచురల్ స్క్రబ్ : ఒక అరటిపండును మెత్తగా చేసి కొంచెం పంచదార కలిపి ఆ మిశ్రమంతో ముఖంపై నెమ్మదిగా మసాజ్ చేయాలి. ఈ న్యాచురల్ స్క్రబ్ చర్మంపైన మృతకణాలను తొలగిస్తుంది. ఇలా చేయడం వల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది.
యాంటీ ఏజింగ్ : అవొకడొ, అరటిపండును కలిపి గుజ్జుగా చేసుకుని ముఖంపై ప్యాక్ మాదిరిగా చేసుకోవాలి. అరగంట తరువాత నీటితో శుభ్రం చే సుకోవాలి. తరచుగా ఇలా చేయడం వల్ల యవ్వనంగా కనపడతారు.
మొటిమలు: మొటిమలు త్వరగా తొలగించాలి అనుకునేవారు... అరటి పండు తొక్కను మొటిమలు వచ్చిన ప్రాంతంపై రుద్దాలి. ఆ తర్వాత 20 నిమిషాలు అలానే వదిలేసి ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల మొటిమలు పూర్తిగా తగ్గిపోతాయి. వాటి తాలుకా మచ్చలు కూడా పోతాయి.
ముఖంపై మచ్చలు: ఒక కప్పులో సగం అరటిపండు పేస్ట్‌ను తీసుకుని అందులోకి టేబుల్‌స్పూన్ తేనెను వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకుంటే మచ్చలు తొలగిపోతాయి.
కప్పులో సగం అరటి పండును తీసుకుని అందులోకి తేనె, నిమ్మరసాన్ని టేబుల్ స్పూన్ చొప్పున కలపాలి. తర్వాత బాగా మిక్స్ చేసి ముఖానికి పట్టిస్తే చర్మం మెరిసిపోతుంది.
సగం అరటిపండును తీసుకుని దానికి తేనె, పెరుగును టేబుల్‌స్పూన్ చొప్పున తీసుకుని మిశ్రమంగా చేసుకుని ముఖానికి పట్టిస్తే మంచి గుణం కనిపిస్తుంది.
ముఖచర్మంపై ఉండే మృతకణాల్ని పోగొట్టాలంటే అరటిపండు, టేబుల్‌స్పూన్ తేనె, కోడిగుడ్డు పచ్చసొన కలిపి ప్యాక్‌లా వేసుకోవాలి. ఆరాక గోరువెచ్చని నీళ్లతో కడుక్కోవాలి.