Asianet News TeluguAsianet News Telugu

జుట్టుకు కలబంద నూనెను పెడితే ఏమౌతుందో తెలుసా?

చాలా మంది జుట్టుకు కలబంద జెల్ ను మాత్రమే వాడుతుంటారు. కానీ దీనికంటే కలబంద నూనె మన జుట్టుకు ఎక్కువ ప్రయోజనాలను అందిస్తుంది. అవేంటంటే? 
 

 Aloe vera oil benefits for hair rsl
Author
First Published Sep 28, 2024, 10:34 AM IST | Last Updated Sep 28, 2024, 11:34 AM IST

కలబంద ఎన్నో ఔషధ గుణాలున్న మొక్క. ఈ మొక్కలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఈ మొక్క మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. ఇది మన జుట్టు మూలాలకు మంచి పోషణను అందించడానికి సహాయపడుతుంది. 

కలబందను వాడటం వల్ల జుట్టు మూలాలు బలంగా అవుతాయి. ఇకపోతే ఈ మొక్కలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు నెత్తిమీదున్న చుండ్రును పూర్తిగా పోగొడుతుంది. జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.

 Aloe vera oil benefits for hair rsl

దీనిని వాడితే మన జుట్టును మూలాల నుంచి చివర్ల వరకు బలంగా ఉంటుంది. కానీ కలబంద జెల్ కంటే కలబంద నూనె మన జుట్టుకు ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. అవును కలబంద నూనెను వాడితే ఒకటి కాదు రెండు కాదు జుట్టుకు సంబంధించిన ఎన్నో ప్రయోజనాలను పొందుతారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

కలబంద నూనె  జుట్టుకు ఎలా ఉపయోగకరంగా ఉంటుంది? 

కలబంద జెల్ ను పెట్టడం వల్ల  జుట్టుకు వెంటనే తేమ అందుతుంది. ఈ జెల్ నుంచి తయారుచేసిన నూనెను వాడితే జుట్టు మూలాల నుంచి చివర్ల వరకు మంచి పోషణ అందుతుంది. కలబంద జెల్ మాత్రమే కాదు.. దీనితో తయారుచేసిన నూనె కూడా జుట్టులో తేమను ఎక్కువ కాలం నిలుపుతుంది. ఆలివ్ ఆయిల్ మన జుట్టుకు చాలా రోజులు మంచి పోషణను అందించేందుకు బాగా సహాయపడుతుంది. అంతేకాదు ఈ నూనె మన జుట్టులోని జిడ్డును పూర్తిగా తొలగించి మెరిసేలా చేస్తుంది. అలాగే జుట్టు స్మూత్ గా, సిల్కీగా అవుతుంది. అంతేకాదు చుండ్రును పూర్తిగా పోగొట్టడంలో కలబంద జెల్ కంటే కలబంద నూనెనే చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. 

కలబంద జెల్ నుంచి నూనెను ఎలా తయారుచేయాలి? 

ఇంట్లో కలబంద జెల్ నుంచి కలబంద నూనెను తయారుచేయడం చాలా ఈజీ. దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు. ఇందుకోసం ఒక కప్పు ఫ్రెష్ కలబంద జెల్ ను తీయండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులో ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనె పోసి దీన్ని కొంచెం వేడి చేయండి. దీంట్లోనే కలబంద గుజ్జును వేసి కలపాలి. అయితే ఈ జెల్ నూనెలో కరిగే వరకు అంటే 5 నుంచి 7 నిమిషాల పాటు తక్కువ మంటపై ఉడికిస్తూ ఉండండి. నూనె, కలబంద గుజ్జు కలిసిపోగానే మంటను ఆఫ్ చేయండి. దీన్ని చల్లార్చి వడకట్టి ఒక సీసాలో పోయండి. 

 Aloe vera oil benefits for hair rsl

జుట్టుకు కలబంద నూనెను ఎలా పెట్టాలి? 

జుట్టుకు కలబంద నూనెను వేళ్లతో నెమ్మదిగా పెట్టండి. ఈ నూనె జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు బాగా పెట్టండి. అలాగే కొద్దిసేపు మసాజ్ చేయండి. దీనివల్ల అలొవేరా ఆయిల్ మీ నూనె జుట్టు మూలాల వరకు బాగా చేరుతుంది. అయితే ఈ నూనె మీరు రాత్రి పెట్టుకుని ఉదయం తలస్నానం చేయొచ్చు. లేదా తలస్నానం చేయడానికి  1-2 గంటల ముందు పెట్టినా సరిపోతుంది. ఈ నూనెను పెట్టిన తర్వాత మంచి మైల్డ్ షాంపూతో తలస్నానం చేస్తే మీ జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. 

కలబంద నూనెతో కలిగే ప్రయోజనాలు

కలబంద నూనెను పెడితే మీ జుట్టు ఫాస్ట్ గా, ఒత్తుగా పెరుగుతుంది. అలాగే ఇది నెత్తిమీద చుండ్రు లేకుండా చేస్తుంది. అలాగే మీ తలను హైడ్రేట్ గా ఉంచుతుంది. ముఖ్యంగా ఇది మీ జుట్టును షైనీగా, మెరిసేలా చేస్తుంది. అంతేకాదు దీనివాడకంతో మీ జుట్టు మృదువుగా అవుతుంది. అలాగే జుట్టు చిక్కులు పడకుండా, బలంగా ఉంటుంది. వెంట్రుకలు తెగిపోవడం కూడా చాలా వరకు తగ్గుతుంది. 

కలబంద జెల్ మనకు ఎలా సహాయపడుతుంది? 

 Aloe vera oil benefits for hair rsl

కలబంద కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుందా? 

కలబంద మన జుట్టుకు, చర్మానికి మాత్రమే కాదు మన శరీరానికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ కలబంద జెల్ మన శరీరంలో లిపోప్రొటీన్ అంటే మంచి కొలెస్ట్రాల్ ను పెంచి చెడు కొలస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడుతుంది. అంతేకాదు ఇది ట్రైగ్లిజరైడ్స్ అనే ఫ్యాట్ లెవెల్స్ ను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.  

కలబంద మలబద్దకాన్ని తగ్గిస్తుందా? 

కలబంద రసం మలబద్దకాన్ని తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. కలబంద జెల్ లో భేదిమందుగా పనిచేసే బార్బలోయిన్ వంటి పదార్థాలు కూడా ఉంటాయి. ఇది మన పేగుల్లో వాటర్ లెవెల్స్ ను పెంచుతుంది. దీంతో మలం మృదువుగా మారుతుంది. పేగుల నుంచి మలం సులువుగా కదులుతుంది. 

కలబంద డయాబెటీస్ ను కంట్రోల్ చేయడానికి సహాయపడుతుందా? 

కలబంద జెల్ డయాబెటీస్ పేషెంట్లకు, ప్రిడియాబయాటీస్ పేషెంట్లకు మంచి మేలు చేస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయలను తగ్గించడానికి సహాయపడుతుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కాబట్టి మధుమేహులు కూడా కలబంద జెల్ ను ఎలాంటి భయం లేకుండా తీసుకోవచ్చు. 

కలబంద జెల్ గుండెల్లో మంటను తగ్గిస్తుందా? 

గుండెల్లో మంట ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది. చాలా మందికి తినగానే ఈ సమస్య వస్తుంది. కడుపు ఆమ్లం వల్లే గుండెల్లో మంట వస్తుంది. అయితే ఈ కలబంద జెల్ అన్నవాహికలో మంటను తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. కానీ దీన్ని మోతాదులోనే తీసుకోవాలి. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios