Asianet News TeluguAsianet News Telugu

చేతిలో మందు గ్లాస్.. ఫ్రెండ్స్ తో చిల్ అవుతున్న భూమిక.. ఫోటో వైరల్

తన స్నేహితులతో కలిసి చిల్ అవుతున్న ఫోటోలను షేర్ చేశారు.  తన స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి చిన్న గెట్ టూ గెదర్ పార్టీ జరుపుకున్నారు.

Actress Bhumika Featured With Wine glass In Photos
Author
Hyderabad, First Published Aug 12, 2021, 10:20 AM IST

సీనియర్ స్టార్ హీరోయిన్ భూమిక.. తన సెకండ్ ఇన్నింగ్స్ అదరగొడుతున్నారు. ఒకప్పుడు స్టార్ హీరోలందరితో నటించి..అందరినీ ఆకట్టుకున్న భూమిక.. పెళ్లి, పిల్లల తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఎంఎస్ ధోనీ బయోపిక్ లో హీరో సిస్టర్ రోల్ లో కనిపించిన భూమిక.. తర్వాత హీరో నాని నటించిన ఎంసీఏ సినిమాలో కీలక పాత్ర పోషించారు.

ప్రస్తుతం  తెలుగు సినిమాల్లో నటించకున్నా.. ఇతర భాషల్లో నటిస్తున్న ఆమె.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ఈ క్రమంలో తాజాగా ఆమె తన స్నేహితులతో కలిసి చిల్ అవుతున్న ఫోటోలను షేర్ చేశారు.  తన స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి చిన్న గెట్ టూ గెదర్ పార్టీ జరుపుకున్నారు.

ఈ ఫోటోల్లో  భూమిక చేతిలో వైన్ గ్లాస్ ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పెద్దింటి ఫ్యామిలీస్‌లో ఇలాంటి చిన్న చిన్న పార్టీలను వీకెండ్స్‌లో జరుపుకోవడం సహజమే. అలానే తన కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి సరదాగా పార్టీ చేసుకున్నారు. దీనికి సంబంధించిన పిక్స్‌ను భూమిక తన ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే నిజంగా భూమికకి వైన్ తీసుకునే అలవాటుందా లేక అలా సరదాగా చేతిలో గ్లాస్ పట్టుకుందా అనేది మాత్రం క్లారిటీ లేదు.

 

కాగా.. భూమిక యువకుడు సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యారు. పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ నటించిన 'ఖుషీ' సినిమాతో స్టార్ హీరోయిన్‌గా మారారు. 'ఒక్కడు', 'వాసు', 'మిస్సమ్మ', 'సాంబ', 'నా ఆటోగ్రాఫ్', 'అనసూయ', 'జై చిరంజీవ' వంటి క్రేజీ మూవీస్‌తో అలరించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ సినిమాలో నటించి స్టార్ హీరోయిన్‌గా వెలిగారు. యోగా గురువు భ‌ర‌త్ ఠాకూర్‌ను పెళ్ళి చేసుకున్న ఈమె కొంతకాలం సినిమాలకి దూరంగా ఉన్నారు. మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చి అక్క, వదిన వంటి పాత్రల్లో కపిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios