Asianet News Telugu

ఒకప్పుడు నిమ్మరసం అమ్మిన మహిళ.. ఇప్పుడు పవర్ ఫుల్ పోలీసు..!

భర్త వదిలేయడంతోనే తన జీవితం ముగిసిపోయిందని ఆమె అనుకొని ఉంటే.. ఈ రోజు ఇంత శక్తివంతమైన మహిళా పోలీసును మనం చూడగిలిగేవారం కాదు.
 

Abandoned with baby at 18, Kerala woman fights all odds to become a cop
Author
Hyderabad, First Published Jun 28, 2021, 2:49 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

పెద్దలను ఎదురించి ప్రేమ పెళ్లి చేసుకుంది. 18ఏళ్ల కే ఓ బిడ్డకు జన్మ కూడా ఇచ్చింది. తన జీవితంలో అంతకుమించి ఆనందం ఏమీ లేదని మురిసిపోయింది. కానీ.. ప్రేమించి పెళ్లాడిన భర్త... మోజు తీరిందని వదిలేశాడు. పుట్టింటికి చేరిన ఆమెకు అక్కడ కూడా ఆదరణ లభించలేదు.

దీంతో.. పొట్టకూటి కోసం.. నిమ్మకాయ సోడా, ఐస్ క్రీం లాంటివి అమ్ముకుంది. అలాంటి మహిళ ఇప్పుడు పవర్ ఫుల్ పోలీసు అధికారిగా ఎదిగింది. సినిమా కథను తలపించే ఈ కథ నిజజీవితంలో చోటుచేసుకుంది. కేరళ కు చెందిన మహిళ ఎందరికో స్ఫూర్తి దాయకం. ఆమె కథ పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తే..

కేరళకు చెందిన అనై శివ(31) అనే మహిళ విజయ గాథ విన్న ఎవరికైనా జీవితంలో తలుచుకుంటే ఎవరు ఏమైనా సాధించగలరనే నమ్మకం కలుగుతుంది. భర్త వదిలేయడంతోనే తన జీవితం ముగిసిపోయిందని ఆమె అనుకొని ఉంటే.. ఈ రోజు ఇంత శక్తివంతమైన మహిళా పోలీసును మనం చూడగిలిగేవారం కాదు.

జీవితంలో కష్టాలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో ఉన్నత శిఖరాలను అధిరోహించిన అనై శివ గురించి కేరళ పోలీస్ విభాగం ట్విట్టర్‌లో పేర్కొంటూ.. ప్రొబేషనరీ ఎస్ఐ‌గా బాధ్యతలు చేపట్టిన ఆమెకు శుభాకాంక్షలు తెలిపింది.

‘‘సంకల్ప శక్తి, ఆత్మ విశ్వాసానికి నిజమైన ప్రతిరూపం.. భర్త, కుటుంబ సభ్యులను విడిచిపెట్టి ఆరు నెలల శిశువుతో వీధుల్లో ఒంటరిగా మిగిలిపోయిన 18 ఏళ్ల బాలిక వర్కాలా పోలీస్ స్టేషన్‌కు సబ్ ఇన్స్పెక్టర్ అయ్యింది’’ అని ట్వీట్ చేసింది. వర్కాలా పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐగా పోస్టింగ్ ఇచ్చిన విషయం తనకు కొద్ది రోజుల కిందటే తెలిసిందని ఏఎన్ఐతో శివ అన్నారు. నా కుమారుడితో వీధుల్లో కన్నీళ్లు పెట్టుకున్నా ఎవరూ మద్దతు దక్కని ప్రదేశం ఇది అని భావోద్వేగానికి గురయ్యారు.

వర్కలా శివగిరి ఆశ్రమంలో నిమ్మరసం, ఐస్‌క్రీమ్‌లు, హస్తకళా వస్తువుల అమ్మకం వంటి చిన్ని చిన్న వ్యాపారాలు చేయడానికి ప్రయత్నించినా ఏదీ కలిసిరాలేదు.. ఈ సమయంలో చదువు పూర్తిచేసి, ఎస్ఐ పరీక్ష రాయమని ఓ వ్యక్తి సలహా ఇచ్చి సాయం చేశాడని తెలిపింది.తాను డిగ్రీ మొదటి సంవత్సరంలో ఉండగానే తల్లిదండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా ప్రేమించిన వ్యక్తిని పెళ్లిచేసుకున్నానని.. ఏడాదిలోపే బిడ్డకు తల్లినయ్యానని.. తర్వాత భర్త వదిలేసి వెళ్లిపోయాడని చెప్పింది.

Follow Us:
Download App:
  • android
  • ios