కేంద్రమంత్రి ప్రముఖ గాయకుడు బబూల్ సుప్రియోకు ఈ ఎన్నికల్లో పరాభవం ఎదురవబోతుందా? అంటే అవుననే తేలుస్తున్నాయి ఇప్పటివరకు వచ్చిన ఫలితాలు.  గత సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందిన బబూల్ సుప్రియో కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు రావడంతో టోలీగంజ్ నుంచి బరిలోకి దిగారు. ప్రస్తుతం జరుగుతున్న కౌంటింగ్ లో తృణమూల్ అభ్యర్థి అరూప్ బిశ్వాస్ 30300 ఓట్లు సాధించి ముందు వరుసలో ఉన్నారు.

ఇక బిజెపి అభ్యర్థి బబూల్ సుప్రియో 16078 సాధించాడు. అంటే తృణమూల్ అభ్యర్థి అరూప్ బిశ్వాస్ 14222 ఓట్ల ఆధిక్యంతో ముందంజలో ఉన్నారు. పూర్తి లెక్కింపు జరిగిన తర్వాత ఫలితాలు మారే అవకాశం ఉండొచ్చు. వేచి చూడాల్సిందే. 

కరోనా వైరస్ దేశంలో విస్తృతంగా వ్యాపిస్తున్న తరుణంలోనే పశ్చిమ బెంగాల్ ఎన్నికలు జరిగాయి. 27 మర్చి నుంచి 29 ఏప్రిల్ వరకు 8 విడతల్లో ఎన్నికలు జరిగాయి. జంగిపూర్, షంషేర్ గంజ్ అభ్యర్థుల ఆకస్మిక మరణం కారణంగా ఎన్నికల సంఘం ఈ రెండు స్థానాల ఎన్నికలను వాయిదా వేసింది. అక్కడ ఉపఎన్నిక మే 16వ తేదీన జరగనున్నాయి. 

బెంగాల్‌లో మమత హ్యాట్రిక్: కమ్యూనిష్టులు బేజారు, 3 సీట్ల నుంచి బిజెపి.......

మొత్తం 294 సీట్లున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో 148 మేజిక్ ఫిగర్. ఎలాగైనా ఈసారి బెంగాల్ లో కాషాయ జెండా రెపరెపలాడించాలని బలంగా భావించిన బీజేపీ, మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని నిలుపుకొని హాట్ ట్రిక్ కొట్టాలని మాత బెనర్జీ, అస్థిత్వాన్ని నిలుపుకోవడానికి కాంగ్రెస్- లెఫ్ట్ కూటమి బరిలో నిలిచాయి. శాయశక్తులా ఎన్నికలో విజయం సాధించేందుకు తుదికంటా పోరాడాయి. 

ఇక ఈ ఎన్నికల్లో హిందుత్వ అస్త్రాన్ని, పరివర్తన నినాదాన్ని భుజానికెత్తుకొని బీజేపీ ప్రచారం చేసింది. ప్రధాని నరేంద్రమోడీ, హోమ్ మంత్రి అమిత్ షా పూర్తిగా బెంగాల్ ఎన్నికల మీద దృష్టిసారించి నెల రోజుల్లో దాదాపుగా తమ పర్యటనలను ప్లాన్ చేసుకొని ప్రచారం నిర్వహించారు. 

మరోపక్క మమతా బెనర్జీ బెంగాలీ అస్థిత్వాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. బెంగాలీలు కాని అమిత్ షా, మోడీ లు వచ్చి బెంగాల్ అస్థిత్వాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని, బెంగాలీలు తమ అస్థిత్వాన్ని కాపాడుకోవాలంటే బీజేపీకి ఓటు వేయకూడదని బలంగా ప్రచారం నిర్వహించారు. 

ఇక ఈ ఎన్నికల పర్వం మొత్తం మాత బెనర్జీ వీల్ చైర్ లో కూర్చొనే ప్రచారం చేసారు. హై వోల్టేజి ఎన్నికల యుద్ధం ఇక్కడ వ్యక్తిగత దాడుల వరకు వెళ్ళింది. బములు విసురుకోవడం, తుపాకీ కాల్పులు అన్ని వెరసి ఎన్నికల వాతావరణం ఒకింత హింసాత్మకంగా మారింది. ఇక ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మాత బెనర్జీ కోసం ఈ ఎన్నికల్లో పనిచేసారు.