ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కీలకమైన పశ్చిమ బెంగాల్‌‌కు సంబంధించి తృణమూల్ కాంగ్రెస్, బీజేపీలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన టీఎంసీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ బుధవారం ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఇది ఎప్పుడో రిలీజ్ చేయాల్సి వున్నా నందిగ్రామ్‌లో మమత గాయపడటంతో ఇది వాయిదా పడింది. ఇక ఇవాళ విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో పలు ప్రజాకర్షక హామీలను మమత బెనర్జీ ప్రకటించారు.

  • రైతులకు ఏటా ఇచ్చే ఆర్ధిక సాయం రూ.10 వేలకు పెంపు
  • ఎస్సీ, ఎస్టీలకు 25 లక్షలు ఇళ్ల నిర్మాణం
  • 4 శాతం వడ్డీతో రుణం తీసుకునేలా విద్యార్ధులకు క్రెడిట్ కార్డులు
  • ఇంటింటికీ రేషన్ డెలివరీ
  • ఏడాదికి ఐదు లక్షల ఉద్యోగాల కల్పన